మరోసారి రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసిన 'RRR' టీమ్..!!

Anilkumar
టాలీవుడ్ అగ్ర హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి సారి కలిసి నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రౌద్రం, రణం, రుధిరం,.దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎమ్. ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రతీ అప్డేట్ ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచింది.దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఇటీవలే షూటింగ్స్ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తిరిగి ఈ సినిమా షూటింగ్ ని పునఃప్రారంభించాడు రాజమౌళి.

 ఇప్పటికే చరణ్, తారక్ షూటింగ్స్ లో పాల్గొన్నారు. ఇక ఇదిలా ఉంటె ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటికే కొంత కన్ఫ్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఇప్పటికే సినిమా పలు మార్లు వాయిదా పడింది. అందులోనూ కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూటింగ్ సైతం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ముందుగా ప్రకటించిన తేదీ అక్టోబర్ 13 న విడుదల కావడం అసాధ్యమని భావించారు అందరూ. కానీ రాజమౌళి మాత్రం సినిమాకి సంబంధించి ఇస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ లో అక్టోబర్ 13 నే రిలీజ్ గా ప్రకటిస్తూ వస్తున్నాడు.

 ఇక తాజాగా కీరవాణి పుట్టినరోజు సందర్భంగా..ఆయనకు rrr టీమ్ బర్త్ డే విషెస్ అందజేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో కూడా మరో సారి అదే తేదీన వస్తున్నామని తెలిపారు చిత్ర యూనిట్.దీంతో rrr ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక స్వతంత్ర సమరయోధులుఅయిన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవిత చరిత్రలకు కొంత ఫిక్షన్ ని జోడించి రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ గా కనిపించనున్నారు.ఇక తెలుగుతో పాటూ వివిధ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: