త్రివిక్రమ్ వల్ల కానిది సుకుమార్ వల్ల అవుతుందా..?
అయితే సునీల్ తన కామెడీ టైమింగ్ తో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న తర్వాత కామెడీ హీరోగా సినిమాలు చేశారు కానీ అవన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో మళ్లీ హీరో ఇమేజ్ వదిలేసి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. గతంలో ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలతోనే మంచి గుర్తింపు దక్కించుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించి.. ఆయన ఇమేజ్ బాగా పెంచేశారు. సునీల్ తన కెరీర్ చేజేతులా పాడు చేసుకున్న తర్వాత కూడా త్రివిక్రమ్ తన "అరవింద సమేత", "అల వైకుంఠపురములో" సినిమాలలో నటింపజేశారు. కానీ దురదృష్టవశాత్తూ సునీల్ కామెడీ కెరీర్ మళ్లీ పురుడు పోసుకులేదు. దీంతో అతన్ని మళ్ళీ మంచి కమెడియన్ గా తీర్చిదిద్దడంలో త్రివిక్రమ్ విఫలమయ్యారు.
మరి త్రివిక్రమ్ వల్ల కానిది సుకుమార్ తన పుష్ప సినిమాతో సునీల్ కి మంచి కెరీర్ ఇస్తారా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇకపోతే కలర్ ఫోటో సినిమాలో సునీల్ ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. పుష్ప సినిమాలో కూడా అలాంటి పాత్రే చేయడం విశేషం. జగపతి బాబు లాగా సునీల్ కూడా నెగిటివ్ రోల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంటారో లేదో చూడాలి. నిజానికి ప్రస్తుతం ప్రతినాయకుడి పాత్రలు పోషిస్తున్న నటులు బాడీ బిల్డర్లు లాగా ఉన్నారు కానీ ఎస్.వి.రంగారావు లాగా హావభావాలు పలికించలేకపోతున్నారు. వారికి బదులు సునీల్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అభిమానుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.