కొత్త సినిమాటోగ్రఫీ చట్టంపై మన వాళ్లు నోరు విప్పరే..!
ఆల్రెడీ కొత్త సినిమాటోగ్రఫీ చట్టంపై తమిళ చల చిత్ర పరిశ్రమ నుండి కమల్ హాసన్, సూర్య వంటి వారు దాన్ని అపోజ్ చేస్తూ తమ స్పందన తెలియచేశారు. సెన్సార్ పూర్తయ్యాక కూడా మళ్లీ సినిమాపై ఆంక్షలు ఉండడం కరెక్ట్ కాదని వారు చెబుతున్నారు. అయితే ఇదంతా జరుగుతుంటే టాలీవుడ్ సినీ ప్రముఖులు మాత్రం తమకు ఏమి పట్టనట్టు చోద్యం చూస్తున్నారు. కొత్త సినిమాటోగ్రఫీ చట్టం పై తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారెవ్వరు నోరు మెదపట్లేదు. కేంద్రం ప్రవేశ పెడుతున్న ఈ కొత్త చట్టం వారికి సబబే అన్నట్టుగా మన వాళ్ల ప్రవర్తన ఉంది.
ఓ పక్క మిగతా పరిశ్రమలకు సంబందించిన వారంతా సినిమాటోగ్రఫీ చట్టం 2021పై విమర్శలు చేస్తుంటే తెలుగు చల చిత్ర పరిశ్రమలో కనీసం దాని గురించి చర్చలు కూడా జరగట్లేదని చెప్పొచ్చు. మనకు సంబందం లేని మ్యాటర్ అన్నట్టుగా మన వాళ్ల ప్రవర్తన ఉంది. అయితే ఊరికే మాటలు చెప్పకుండా సరైన టైం లో ఈ ప్రతిపాధనని మన వాళ్లు వ్యతిరేకించి ఆ చట్టం అమలు కాకుండా చూస్తారని కొందరు చెబుతున్నారు. కొత్త సినిమాటోగ్రఫీ చట్టం సవరణపై తెలుగు పరిశ్రమ స్పందన గురించి ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. తెలుగు సినీ పెద్దలు కూడా ఈ సినిమాటోగ్రఫీ చట్టం గురించి జోక్యం చేసుకుని దాని మీద చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతానికి తెలుగు సినీ పెద్దలంతా ఈ విషయంపై సైలెంట్ గా ఉండటం షాక్ అయ్యేలా చేస్తుంది.