కష్టాల్లో యంగ్ హీరోస్..!

NAGARJUNA NAKKA
ఏ స్టార్‌ హీరోకైనా... ఒకటి రెండు ఫ్లాపులొచ్చినా మార్కెట్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌లో ఏ మాత్రం క్రేజ్ తగ్గదు. కానీ యువ హీరోలు ఓటమి చవిచూస్తే అప్పుడే మార్కెట్‌లో తేడాలొచ్చేస్తాయి. బిజినెస్ అంతా పడిపోతుంది. ఇప్పుడు కొంతమంది యువ హీరోలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. కంపల్సరీగా హిట్‌ కొట్టాల్సిన స్టేజ్‌లో ఉన్నారు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తొలి రెండు మూడు సినిమాలతోనే సూపర్ స్టార్డమ్ సంపాదించాడు. కానీ వరుస ఫ్లాపులతో ఈ మార్కెట్‌ రేంజ్ కొంచెం తగ్గిపోయింది. 'డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు విజయ్‌ని దెబ్బకొట్టాయి. దీంతో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో చేస్తోన్న 'లైగర్' సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు విజయ్.

మీడియం రేంజ్‌ హీరోస్‌లో నానికి యూనిక్‌ ఇమేజ్ ఉంది. యూత్‌, ఫ్యామిలీస్‌ ఇద్దరికీ దగ్గరయ్యాడు. అయితే 'జెర్సీ' తర్వాత నాని కొంచెం స్లో అయ్యాడు. 'గ్యాంగ్ లీడర్, వి' సినిమాలు అంచనాలు అందుకోలేకపోయాయి. దీంతో 'టక్‌ జగదీష్‌'తో సందడి చేయాలనుకుంటున్నాడు. ఈ మూవీ సమ్మర్‌లోనే రిలీజ్ కావాల్సింది. కానీ లాక్‌డౌన్‌తో బ్రేకులు పడ్డాయి.

శర్వానంద్‌కి ఆడియన్స్‌లో సెపరేట్‌ ఇమేజ్ ఉంది. యూనిక్‌ స్టోరీస్‌తో సర్‌ప్రైజ్ చేస్తాడనే అంచనాలున్నాయి. అయితే మూడేళ్లుగా శర్వా సినిమాలు ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోతున్నాయి. 'పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం' సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర తడబడ్డాయి. శర్వా ఇప్పుడు 'మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలతో పాటు ఒక బైలింగ్వల్‌ మూవీ చేస్తున్నాడు.

'ఆర్.ఎక్స్.100'తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు కార్తికేయ. అయితే ఈ సినిమా తర్వాత కార్తికేయకి మళ్లీ ఆ రేంజ్‌లో సక్సెస్‌ రాలేదు. 'హిప్పీ, గుణ 369, 90 ఎమ్.ఎల్., చావుకబురు చల్లగా' సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో కార్తికేయ గ్రాఫ్ డౌన్ అవుతోంది. మెగా ప్రొడ్యూసర్‌ వారసుడిగా వచ్చిన అల్లు శిరీష్‌ జర్నీ కూడా ఫ్లాపులతోనే నడుస్తోంది.  'శ్రీరస్తు శుభమస్తు' తర్వాత శిరీష్‌కి సరైన హిట్ లేదు. 'ఒక్క క్షణం, ఏబిసిడి' లాంటి ఫ్లాపులతో శిరీష్‌ స్లంపులో పడిపోయాడు. సందీప్ కిషన్ కూడా సరైన హిట్‌ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: