ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. ఒకప్పుడు బాలీవుడ్ లోనే బయోపిక్ లకు ఎక్కువ క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు తో పాటు అన్ని భాషల లో బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. అయితే క్రీడాకారులు, సినీ నటుల జీవితాల తో పాటు ప్రస్తుతం రాజకీయ నాయకుల బయోపిక్ లను తెరకెక్కించడం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. చనిపోయిన తర్వాత కంటే బ్రతికుండగానే బయోపిక్ లను ఎక్కువగా తెరకెక్కించడం విశేషం. ఇక తాజా సమాచారం ప్రకారం సీఎం జగన్ బయోపిక్ ను కూడా త్వరలోనే చూడబోతున్నాం. అంతేకాకుండా ఈ బయోపిక్ బాహుబలి రేంజ్ లో ఉంటుందని స్పష్టం గా కనిపిస్తోంది.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర ను తెరకెక్కించిన దర్శకుడు మాహి వీర రాఘవ నే జగన్ బయోపిక్ ను తెరకెక్కించబోతున్నారు. యాత్ర సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు జగన్ బయోపిక్ ను కూడా ఎంతో మందికి నచ్చేలా తెరకెక్కించబోతున్నట్టు దర్శకుడు చెబుతున్నాడు. సీఎం జగన్ జీవితం ఎంతో మందికి, రాబోయే తరాలకు ఇన్స్పిరేషన్ ఉంటుందని అందుకోసమే ఆయన బయోపిక్ ను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు చెబుతున్నాడు.
మరోవైపు ఈ సినిమాలో జగన్ పాత్రలో బాలీవుడ్ నటుడు నటించబోతున్నాడు. స్కాం 1992 వెబ్ సిరీస్ లో ప్రధానపాత్రలో నటించిన ప్రతిక్ గాంధీ.... జగన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ప్రతిక్ గాంధీని దర్శకుడు అప్రోచ్ అవగా ఆయన ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న సినిమా కావడం వల్ల ప్రతీక్ గాంధీ క్రేజ్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా లో వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంతో పాటు వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ సీఎం గా ఎలా ఎదిగారు అన్న దాన్ని కూడా చూపించబోతున్నారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి.