సాయికిరణ్ తను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకోవడానికి కారణం..
సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది నటులు అడుగుపెట్టి, అనతి కాలంలోనే స్టార్ హీరోలు గా ఎదుగుతున్న విషయం తెలిసిందే. అయితే మరికొంతమంది ఒకటి, రెండు సినిమాలకే ఒక వెలుగు వెలిగినా ,ఆ తర్వాత అదృష్టం వరించక సినీ ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. ఇక అలాంటి వారిలో సాయి కిరణ్ కూడా ఒకరు. గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి దూరమైన సాయి కిరణ్ కి సంబంధించిన ఒక వార్త, ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
సాయి కిరణ్ ఎవరో కాదు.. ప్రముఖ సింగర్ పి.సుశీల గారి మనవడు. ఈ విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ ఈయన ఆమె సహాయం తోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. సినీ ఇండస్ట్రీలోకి" నువ్వే కావాలి " చిత్రం ద్వారా అడుగు పెట్టి, ఆ తర్వాత ప్రేమించు, ఎంత బాగుందో, మనసుంటే చాలు, రావే నా చెలియా వంటి పలు చిత్రాల్లో నటించాడు. నువ్వేకావాలి సినిమా లో సెకండ్ హీరో గా నటించి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుని, వరుస ఆఫర్లు తెచ్చుకున్నాడు. కాకపోతే ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా పెద్దగా అతనికి గుర్తింపు ఇవ్వలేకపోయింది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శిరిడీసాయి, నక్షత్రం, జగపతి, గోపి గోడ మీద పిల్లి వంటి చిత్రాలలో నటించాడు.
ఇక టాలీవుడ్ లో ఏ మాత్రం తనకు అదృష్టం కలిసి రావడం లేదని , బుల్లితెరపై అడుగులు వేసి కోయిలమ్మ అనే ధారావాహికలో కూడా నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం సాయికిరణ్ గురించి వైరల్ అవుతున్న వార్త విషయానికి వస్తే, తన కుటుంబం కోసం తను ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకున్నాడు. ముఖ్యంగా సాయికిరణ్ తను సినీ ఇండస్ట్రీ లో ఉన్నప్పుడు కేవలం ఆ హీరోయిన్ తో నే ఎక్కువ సినిమాలు చేయడంతో, వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని వార్తలు కూడా వినిపించాయి. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సాయి కిరణ్ ఫ్యామిలీకి ఆ హీరోయిన్ బాగా పరిచయం.అందుకే ఈ వార్తలు బాగా పుట్టుకొచ్చాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ లయ.
కానీ కుటుంబ సభ్యులకు సాయికిరణ్ ఈమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో , వారిని నొప్పించడం ఇష్టంలేక, తను ప్రేమించిన అమ్మాయిని కూడా దూరం చేసుకున్నాడు.