టీడీపీ బతకాలంటే ఎన్టీఆర్ రావాల్సిందే...బాబు మోహన్ సంచ‌ల‌నం... !

MADDIBOINA AJAY KUMAR
ప్రస్తుతం టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒక స్టార్ హీరో గా కొనసాగుతున్నారు. వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. 18 సంవత్సరాల వయసులో సినీ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ అప్పటి నుంచి తన సత్తా చాటుతూనే ఉన్నాడు. ఎన్టీఆర్ ప్రతి పాత్రలో తనదైన శైలిలో ఒక వైవిధ్యాన్ని చూపుతూ ఉంటారు. దాంతో యంగ్ టైగర్ ను ఒక ఆల్ రౌండర్ అంటారు. అంతే కాకుండా న‌ట‌న‌లోనూ డ్యాన్స్ చేయ‌డంతోనూ ఎన్టీఆర్ కు పోటీ లేర‌ని అభిమానులు మురిసిపోతుంద‌టారు. యంగ్ టైగర్ సింగిల్ టేక్ యాక్టర్ అని, కెమెరా కోసమే పుట్టాడని కొందరు స్టార్ డైరెక్టర్ లు చెప్పిన‌ సందర్బాలు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండ‌గా ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీ కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. 


ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీతార‌లు ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై కామెంట్లు చేస్తుంటారు. కాగా తాజాగా సీనియర్ నటుడు బాబు మోహన్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం పై సంచలన కామెంట్స్ చేశారు. బాబు మోహన్ ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ.... ప్రస్తుతం టీడీపీ కి ఎన్టీఆర్ అవసరం ఎంతగానో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ బ‌త‌కాలంటే ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాల్సిందేన‌ని అన్నారు. అలా అయితేనే టీడీపీ పార్టీ బ్ర‌తుకవ‌చ్చ‌ని అన్నారు. అంతే కాకుండా తాను కూడా ఎన్టీఆర్ ఎప్పుడు వ‌స్తాడా అని ఎదురుచూస్తున్న‌ట్టు తెలిపారు. మ‌రోవైపు ఒక‌వేళ ఎన్టీఆర్ వ‌స్తే పార్టీకి ప‌ట్టిన మ‌సి అంతా క‌డిగేసి వ‌స్తారో..లేదంటే వేరే పార్టీతో రంగంలోకి దిగుతారో తెలియ‌దు క‌దా లంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.


ఇక ప్ర‌స్తుతం బాబు మోహ‌న్ చేసిన కామెంట్లు సంచ‌ల‌నం గా మారాయి. ఇదిలా ఉండ‌గా యంగ్ టైగర్ రాజకీయ ప్రవేశం కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో పార్టీ తరుపున ప్రచారం చేశారు. అప్పుడు ప్రజలు కూడా భారీగా తరలి వచ్చారు. దాంతో యంగ్ టైగర్ రాజకీయ ప్రవేశం జరిగిపోయిందని అందరు అనుకున్నారు. కానీ తరవాత మాత్రం ఎన్టీఆర్ పార్టీ లో కనబడలేదు. అయితే ఇప్పుడు కూడా పార్టీ బలం కోసం ఎన్టీఆర్ రావాలని తెలుగు త‌మ్ముళ్లు కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: