
రష్మిక రోజుకు ఎన్ని సిగరెట్లు ఊదేస్తుంది...!
అటు కోలీవుడ్ లోనే కాకుండా.. ఇటు బాలీవుడ్ లో కూడా ఆమె నటిస్తోంది. ఇక ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె తాజా చర్చల్లో తనకు ఆరు భాషలు వచ్చని.. తాను ఆరు భాషలు మాట్లాడతానని చెప్పింది. అంతే కాదు ఆమె గతంలోనే తాను వైన్ తాగుతాను అన్న విషయం ఓపెన్‌గానే చెప్పింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ అంతా రష్మిక మమూలుది కాదని అవాక్కయ్యారు. పోర్క్ తింటూ వైన్ వేసుకుంటే స్వర్గంలో తేలినట్టే ఉంటుందని రష్మిక చెప్పింది.
కట్ చేస్తే మీరు రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు ? అని ఓ నెటిజన్ ప్రశ్న వేయడంతో ఆమె సింపుల్‌గా సమాధానం ఇచ్చారు. ఆ ఆకతాయి ప్రశ్నకు రష్మిక సీరియస్ అవ్వలేదు. తాను ఎప్పుడూ సిగరెట్లు తాగనని.. అంతే కాకండా తన చుట్టుపక్కల ఉన్న వారు కూడా సిగరెట్ తాగినా తనకు నచ్చదని చెప్పింది. తనకు ఫిట్‌నెష్ ముఖ్యం కాదని.. కష్ట పడి పని చేయడమే ముఖ్యం అని చెప్పింది ఈ కన్నడ కస్తూరి. ఇక రష్మిక ప్రస్తుతం సౌత్ నే కాదు నార్త్ ను కూడా ఏలేందుకు రెడీ అవుతోంది. ఆమె బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తోంది.