అయితే పూజా హెగ్దే లేదంటే రష్మిక..!
స్టార్ హీరో సినిమా అంటే హీరోయిన్ గా ముందు ఉన్న ఆప్షన్స్ ఇద్దరే ఇద్దరు. సినిమాలో హీరోయిన్ కాస్త గ్లామర్ షో చేయాలి.. కొద్దిపాటి నటన ఉన్నా సరిపోద్ది అనుకుంటే పూజా హెగ్దేకి ఆ ఆఫర్ దక్కినట్టే. ఇక గ్లామర్ తక్కువ పాళ్లు ఉండి నటన బాగా చేయాలనుకుంటే రష్మికకు ఆ ఆఫర్ దక్కినట్టే. ఒక్కోసారి ఆమె చేయాల్సిన సినిమా ఈమె.. ఈమె చేయాల్సిన సినిమ ఆమె చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. పూజా హెగ్దే మాత్రం ప్రస్తుతం టాప్ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. మొదట్లో ఫెయిల్యూర్ హీరోయిన్ అయిన అమ్మడు ఇప్పుడు డేట్స్ ఖాళీ లేవని చెప్పేంత బిజీ హీరోయిన్ అయ్యింది.
ఇక కన్నడ భామ రష్మిక కూడా అంతే.. తెలుగులో వస్తున్న ప్రతి ఛాన్స్ వాడుకుంటూ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది అమ్మడు. పూజా హెగ్దే తర్వాత తెలుగులో ఆ రేంజ్ ఉన్న హీరోయిన్ రష్మికనే. సమంత, అనుష్క, కాజల్, తమన్నా వీరంతా రేసులో వెనకపడగా ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోయిన్స్ టాప్ పొజిషన్ లో ఉన్నారు. టాప్ 1,2 అని లెక్కలు చెప్పలేం కాని వీరు చేస్తున్న సినిమాలు మాత్రం ఆడియెన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తున్నాయి. వీళ్ల ఫాం కు తగినట్టుగానే రెమ్యునరేషన్ కూడా భారెగా డిమాండ్ చేస్తున్నారు. అయినా సరే దర్శక నిర్మాతలు వీరి కోసం క్యూ కడుతున్నారు.