బొద్దుగుమ్మ ఊహించని పనులు.. అంతా షాక్..!
మొన్నటి దాకా నమిత ఐటమ్ సాంగ్స్ కే పరిమితమయింది. పెళ్లి తర్వాత కోలీవుడ్ సినిమాలకు పూర్తిగా దూరమవుతుందనే అంతా అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి మళ్ళీ తన హవా మొదలు పెడుతోంది. ఇటీవల తన పేరు మీద ఓటీటీ స్థాపించింది. ఇప్పుడు తన పేరు మీద ఓ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీని మొదలు పెట్టి సినీ ఇండస్ట్రీలో బిజినెస్ స్టార్ట్ చేసింది.
ఓ వైపు ఓటీటీ పనులతో పాటు, సినీ నిర్మాణ పనుల్ని చూసుకుంటూ క్షణం గ్యాప్ లేకుండా గడుపుతోంది ఈ బొద్దుగుమ్మ. "నమిత ఫిలిం ఫ్యాక్టరీ అనే బ్యానర్ పెట్టి.. ఆ బ్యానర్ పై " బౌ..వావ్" పేరుతో కుక్క చుట్టూ తిరిగే సినిమాను రూపొందిస్తుంది. ఇందులో నమితనే ప్రధాన పాత్ర పోషించింది. అంతేకాదు ఏకంగా ఐదు నుండి ఆరు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతుంది. అంతేకాదు ఆ తర్వాత ఇదే బ్యానర్ లో మరిన్ని చిత్రాలకు స్క్రిప్ట్ పనులు చేయిస్తోంది నమిత.
రాబోయే రోజుల్లో ఓ తెలుగు, తమిళ బైలింగ్యువల్ సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుంది. నమిత థియేటర్ పేరిట స్థాపించిన ఓటీటీ పనులు చాలా స్పీడ్ గా సాగుతున్నాయి. ప్రస్తుతానికి 40 నిమిషాల నిడివితో షార్ట్ ఫిలిమ్స్ స్ట్రీమింగ్ కు పెట్టామని చెబుతోంది. కరోనా వల్ల లాంచింగ్ చేయలేకపోయామని, త్వరలోనే గ్రాండ్ గా లాంచ్ గా ఉంటుందని చెబుతోంది నమిత. అమెజాన్ ప్రైమ్, ఆహాకు పోటీగా తాము కూడా సినిమాలు కొని స్ట్రీమింగ్ కు పెడతామని సినీ జనాల్లో ఆశలు రేపుతోంది. నమిత సెకండ్ ఇన్నింగ్స్ ఈ విధంగా ఉంటుందని ఎవరూ అనుకోని ఉండరు.