టాలీవుడ్ లో సందీప్ కిషన్ చేసే సినిమా లు వరుస గా ఫ్లాప్ అవుతున్నా కూడా ఆయనకు సినిమా అవకాశాలకు ఎలాంటి లోటు లేదు. ఇటీవల A1 ఎక్స్ ప్రెస్ సినిమాతో భారీ ఫ్లాప్ ను అందుకున్న కూడా ఆయనకు మరో మూడు సినిమాలు చేసే అవకాశం వచ్చింది. వెరైటీ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్నారు ఎనర్జిటిక్ స్టార్ సందీప్ కిషన్. స్నేహగీతం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సందీప్ కిషన్ ఆ తర్వాత చాలా సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.
ప్రస్థానం సినిమా ఆయనకు పేరుతెచ్చిన సినిమాలలో ఒకటి. ఆ తరువాత ఆయన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో కమర్షియల్ హిట్ అందుకున్నారు. మళ్లీ ఆయన కు హిట్ అంటే పెద్దగా ఏది రాలేద నే చెప్పాలి. నిన్ను వీడని నీడను నేనే అనే సినిమాతో విజయాన్ని అందుకున్న ఆయన కెరీర్లో ఎక్కువగా ఫ్లాప్ సినిమాలు చేయడమే ఆయనను కిందకు దిగేలా చేసింది. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గల్లీ రౌడీ.
టాలీవుడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ గా బాక్సాఫీస్ వద్ద సాధించిన ఎన్నో సూపర్ సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్ర పోషించిన కొన వెంకట్ ఈ చిత్రానికి సమర్పకుడిగా నిర్వహించడమే కాకుండా స్క్రీన్ ప్లే కూడా అందించా రు. కోన ఫిలిం కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ స్టార్ నటుడు బాబీ సింహ విలన్ గా నటిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్ గా చేస్తుండగా ఈ సినిమా షూటింగ్ పార్ట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొత్తం పూర్తి చేసుకొని సెన్సార్ కు సిద్ధమైనట్లు ఇటీవలే తెలిపింది.