విక్రమ్- సదా రిలేషన్ షిప్.. షోలో అసలు విషయం చెప్పేసిన హీరోయిన్?
ఈ సినిమాలో విక్రమ్ నటన సదా అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో సదా విక్రమ్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. అయితే ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరైన సదా విక్రమ్ తో తనకు ఉన్న రిలేషన్ షిప్ గురించి బయట పెట్టేసింది. ఈ విషయం గురించి తెలిసిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాధారణంగా అయితే సదా కాంట్రవర్సీ లకు ఎంతో దూరంగా ఉంటుంది. అటు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్గా ఉండదు. ఇకపోతే ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా పలు విషయాలను బయటపెట్టింది.
సాధారణంగా తెరమీద ఎంతో క్లోజ్గా రొమాంటిక్ గా కనిపించిన హీరోహీరోయిన్లు అటు తెరవెనుక మాత్రం బ్రదర్ అండ్ సిస్టర్ గా ఉండటం చాలా తక్కువ గా కనిపిస్తూ ఉంటుంది కానీ అపరిచితుడు సమయంలో విక్రమ్ ఏకంగా సదాను సోదరి అనేవారట. ఇక ఈ విషయం తెలుసుకున్న డైరెక్టర్ శంకర్ షాక్ అయ్యాడట. సినిమాలో మీ ఇద్దరిని సీతారాములాగా చూపించాలి అనుకుంటే మీరేమో అన్న చెల్లెలు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారా.. ఇది బయటకు తెలిస్తే నా సినిమా ఎవరైనా చూస్తారా అంటూ ఎంతో భయపడిపోయారు శంకర్. ఇక ఇటీవల ఈ విషయాన్ని చెబుతూ సదా తెగ నవ్వేసింది. ఇటీవలే విడుదలైన ఆలీతో సరదాగా షో కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.