నాని సినిమా చూసి నాలుగైదు సార్లు ఏడ్చేశానన్న షాహిద్..!
జెర్సీ సినిమాలో నాని నటనకి ఫిదా అవని సిని అభిమాని ఉండడు. నాని తన నట విశ్వరూపం చూపించిన ఈ సినిమాపై ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ప్రశంసలు అందించారు. ఇక ఇదిలాఉంటే నానికి ఏమాత్రం తగ్గకుండా షాహిద్ కపూర్ నటన ఉంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ షాహిద్ కపూర్ హిందీలో అర్జున్ రెడ్డి సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. కబీర్ సింగ్ గా దేవరకొండ యాటిట్యూడ్ ను బాలీఎవుడ్ లో కొనసాగించాడు షాహిద్ కపూర్.
ఇక ఇప్పుడు నానిలా జెర్సీ హీరోగా ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నాడు. గౌతం తిన్ననూరి షాహిద్ కపూర్ తో కూడా సినిమా ఫీల్ ఏమాత్రం తగ్గనివ్వకుండా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. హిందీ జెర్సీలో షాహిద్ కూడా అదిరిపోయేలా నటించాడట. చూస్తుంటే షాహిద్ కు జెర్సీ రూపంలో మరో సూపర్ హిట్ వచ్చేలా ఉంది. సినిమాలో నాని ఎంతగా మదిని దోచాదో అదే రేంజ్ లో షాహిద్ కపూర్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తాడని అంటున్నారు. షాహిద్ జెర్సీ సినిమా చేసిందుకు చాలా ఎమోషనల్ అవుతున్నాడు. మరి ఇంత కష్టపడిన షాహిద్ కు జెర్సీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. షాహిద్ కపూర్ మాత్రం జెర్సీ సినిమాపై ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమా అక్కడ కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంటుందని నమ్మకంతో చెబుతున్నాడు. గౌతం తిన్ననూరి కూడా హిందీ వర్షన్ అవుట్ పుట్ మీద పూర్తి సాటిస్ఫై గా ఉన్నారు.