విజయ్ కోసం చిందేసిన కీర్తి.. నెట్టింట వైరల్...

Purushottham Vinay
మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె నటన గురించి అందరికీ తెలిసిందే.ఇక కీర్తి ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. అయితే మహానటి లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ మాత్రం అందులేకపోయారు. అలా కీర్తి సురేష్ చేసిన చిత్రాలన్నీ కూడా వరుసగా వరుసగా ప్లాప్ అవుతూ బోల్తా కొడుతున్నాయి.ఇక ఎన్నో అంచనాల నడుమ వచ్చిన పెంగ్విన్, మిస్ ఇండియా ఫ్లాప్ అయ్యాయి.నితిన్ తో చేసిన రంగ్ దే సినిమా ఓ మోస్తరుగా ఆడినా చివరకు కలెక్షన్ల పరంగా ఫ్లాపుగానే ముద్ర వేసుకుంది. అయితే మన మహానటి కీర్తి సురేష్‌కు ఇంత వరకు తెరపై డ్యాన్సులు వేసి తన విశ్వరూపాన్ని చూపించే అవకాశం రాలేదు.ఇక కీర్తి సురేష్ ఊర మాస్ స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందో తాజాగా చూపించారు. సౌత్ ఇండియా సూపర్ స్టార్ దళపతి విజయ్ బర్త్ డే సందర్బంగా హీరో మీదున్న ప్రేమను తన స్టైల్లో చాటుకున్నారు.ఇక గత ఏడాది విజయ్ బర్త్ డే సందర్భంగా కీర్తి సురేష్ వీణ వాయించి షాకిచ్చారు.ఇక ఈ సారి కూడా విజయ్ బర్త్ డే సందర్భంగా మాస్ డ్యాన్స్ వేశారు. తన తమ్ముడితో కలిసి ఏదో విజయ్ కోసం అలా డ్యాన్స్ వేసేశానని అన్నారు. ఇక దళపతి విజయ్ అంటే తనకు ఏ రేంజ్‌లో ఇష్టముందో ఇలా కీర్తి చెప్పకనే చెప్పేశారు. ఇక కీర్తి సురేష్ వేసిన మాస్ స్టెప్పులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కీర్తి సురేష్ విజయ్ కలిసి ఏజెంట్ భైరవ ఇంకా సర్కార్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో సర్కారు వారి పాట చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన హీరోయిన్‌గా లక్కీ చాన్స్ కొట్టేశారు.ఇక ఆమె నటించిన గుడ్ లక్ సఖి షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకొని ఇప్పుడు విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే.




https://twitter.com/KeerthyOfficial/status/1407288757322059776?s=19

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: