20 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీ మంజునాథ..

Divya

అర్జున్ హీరోగా,సౌందర్య హీరోయిన్ గా దర్శకధీరుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం "శ్రీమంజునాథ" .ఈ సినిమా లో శివుని పాత్ర లో మెగాస్టార్ చిరంజీవి నటించగా,పార్వతి పాత్రలో నటి మీనా నటించింది. అయితే ఈ సినిమా విడుదలయి ఈరోజుకి 20 సంవత్సరాలు. ఇక ఈ సినిమా యొక్క విశేషాలు తెలుసుకుందాం.


2001వ సంవత్సరంలో జూన్ 22న ఈ చిత్రం విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దైవాత్మిక చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో పరమ శివుడి భక్తి పారవస్యుడై , ఒక హేతువాది చివరికి అంతా నీవే స్వామి అనే స్థితికి చేరుకుంటాడు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం పరమశివుడి తో ఆయన ఆరాధన తోనే మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రాన్ని మనం ప్రతి సంవత్సరం ఈ టీవీ లో చూడడం విశేషం. ఇక చిత్రం వస్తే, ఈ చిత్రంలో సంగీతం, నటీనటులు నటించే విధానం, ముఖ్యంగా చిరంజీవి నటించిన శివుని పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక అంతే కాదు నిజ జీవితంలో భార్య భర్తలు అయినా సుమలత , ఆమె భర్త ఈ సినిమాలో రాజు , రాణి గా నటించడం మరో విశేషం..ఇక ఇందులో సౌందర్య,అర్జున్ ఒక సన్నివేశంలో (తన కుమారుడు చనిపోయాడు అన్న విషయం తెలిసి కూడా) అక్కడికి వచ్చిన కొందరి పండితులకు భోజనం వడ్డిస్తూ, ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే అతిథులను ఇబ్బంది పెట్టకూడదు అన్న ఒక్క ఆలోచన.. సన్నివేశ రూపంలో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.

ఈ సినిమా కథను కోటిలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిన  ఒక భక్తుని కథ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా.ఇక సౌందర్య, అర్జున్ అయితే ఈ సినిమాలో లీనమైపోయి నటించారు. ఇక అంతే కాకుండా చిరంజీవి కూడా ఇలాంటి భక్తి చిత్రాలలో నటించడం విశేషం అని చెప్పుకోవచ్చు. దేవుడంటే భక్తి లేనివాడికి ఈ సినిమా చూస్తే భక్తి పుట్టుకొస్తుందని కూడా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: