మెగా పవర్ స్టార్ ఖాతాలో మరో రికార్డు.. అత్యంత వేగంగా..

Purushottham Vinay
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచే నీళ్లు తాగినంత ఈజీగా రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు. ఇక చెర్రీ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండడు.నిజం చెప్పాలంటే రామ్ చరణ్ సోషల్ మీడియాలో చాలా లేటుగా ఎంట్రీ ఇచ్చాడు.ఇక ముందుగా ఫేస్ బుక్‌లోకి వచ్చిన రామ్ చరణ్ ఆ తరువాత చాలా కాలానికి (2019) ఇన్ స్టాగ్రాంలో అడుగుపెట్టాడు.అలా మొత్తంగా రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికలపైనా సందడి చేస్తున్నాడు. కానీ సమయం సందర్భం ఉంటే తప్పా ఎప్పుడు పడితే అప్పుడు ప్రతి చిన్నదానికి రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడు. అలాంటి రామ్ చరణ్‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.

ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇన్ స్టాగ్రాం ఖాతాలో నాలుగు మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే వేగంగా చెర్రీ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. అయితే రామ్ చరణ్ కంటే అధిక ఫాలోవర్లున్న టాలీవుడ్ హీరోలు కూడా వున్నారు.ఇన్ స్టాగ్రాం విషయానికి వస్తే విజయ్ దేవరకొండ,బన్నీలు టాప్ ప్లేస్‌లో ఉన్నారు.వీరి తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు రెండవ స్థానంలో మూడవ స్థానంలో ప్రభాస్ వున్నాడు. ఇక వీరి తరువాత అలా రామ్ చరణ్‌కు తక్కువ కాలంలోనే నలభై లక్షల మంది భారీ ఫాలోవర్లు వచ్చి చేరారు.

ఇక ఈ రోజు ఉదయమే రామ్ చరణ్ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు. రాజమౌళితో చేస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలుపెట్టబోతోన్నామని ప్రకటించారు. ఇక ఈ మేరకు తన హెయిర్ స్టైలీష్ట్ రామరాజు పాత్రకు తగ్గట్టుగా మార్చడంతో ఈ విషయాన్ని చెప్పేశాడు చెర్రీ. ఇక హెయిర్ స్టైలీష్ట్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ షూటింగ్ అప్డేట్ ఇచ్చేశాడు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో సీన్స్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.ఇక మొత్తానికి ఈ షెడ్యూల్‌ను దర్శకధీరుడు రాజమౌళి గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: