ఆ హీరో తాగి నటిస్తారా...?

Suma Kallamadi
బాలీవుడ్ లో సూప‌ర్ స్టార్ రేంజ్‌లో దూసుకుపోతున్న స్టార్ హీరో అమీర్ ఖాన్ తన మూవీల విష‌యంలో ఎంత శ్రద్ద తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనవ‌స‌రం ర్లేదు. ఇప్పుడు ఆయ‌న పదుల సంఖ్య‌లో కేజీల బరువు తగ్గడంతోపాటుగా బ‌రువు పెరగడం వ‌ర‌కు ఆయ‌న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటారు. లుక్ కోసం నెలలకు నెలలు జిమ్‌లో వర్కౌట్ లు చేసి మరీ మూవీ షూటింగ్‌లు చేస్తూ ఉంటాడు. అంతగా కష్టపడుతాడు కాబ‌ట్టే అమీర్ ఖాన్ సూపర్ స్టార్ అయ్యాడు అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.
ప్ర‌స్తుతం వరుస సక్సెస్ లతో దూసుకు పోతున్న హీరో అమీర్ ఖాన్ బాలీవుడ్ కు వంద కోట్ల ను పరిచయం చేసిన వాడిగా మిగిలిపోయాడు. ఆ తర్వాత కూడా వరుసగా వందల కోట్ల మూవీల‌ను కూడా అమీర్‌ఖాన్ చేశాడు. ఇక రీసెంట్‌గా ఆయ‌న నటించిన దంగల్ మూవీ బాహుబలి 2 ను మించి వసూలు చేసింది. ఆయ‌న రోల్ కోసం అమీర్ ఖాన్ పడే తాపత్రయం ఎలాంటిదో ఈ చిన్న ఘటన ఆధారంగా చెప్ప‌వ‌చ్చు.
కాగా దిగ్గజ డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరాని డైరెక్ష‌న్ లో రూపొందిన త్రి ఇడియట్స్ మూవీలో అమీర్ ఖాన్ చేశాడు. కాగా ఆ సినిమాలోని ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి హీరో పాత్ర తాగే సీన్ అద్భుతంగా ఉంటుంది. ఆ టైమ్‌లో అమీర్ ఖాన్ నిజంగా తాగి యాక్టింగ్ చేయాలని అనుకున్నాడంట‌. అందు కోసం ఏకంగా చిత్ర యూనిట్ సభ్యులతో పాటు డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరాని కూడా అంగీకరించలేదు. నార్మల్ గా నటిస్తే స‌రిపోతుంది కానీ అంతగా అవసరం లేదు అన్నట్లుగా వారు చెప్పారంట‌.
కానీ హీరో అమీర్ ఖాన్ మాత్రం తాగి నటించాడని చెబుతున్నారు. రెండు పెగ్గులు తాగి ఆ తర్వాత ఆ సీన్‌లో అమీర్ ఖాన్ బాగా చేశాడంట‌. ఆ సీన్ చాలా బాగా పండింద‌ని తెలుస్తోంది. మూవీ ఎంతటి సక్సెస్ అయ్యిందో అంద‌రికీ తెల్సిందే. దాదాపుగా రూ.500 కోట్లకు పైగా క‌లెక్ష‌న్లు కురిపించి అప్పట్లోనే ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. ఇప్పటికి కూడా బుల్లి తెర మరియు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీని జనాలు ఎంజాయ్ చేస్తున్నారు అంటే అది కేవలం అమీర్ ఖాన్ నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: