బన్నీ భార్యను చూసి కుళ్ళుకుంటున్న హీరోయిన్స్... ?
కానీ హీరో భార్యలకు అది కూడా సినీ నేపధ్యం లేని వారికి కూడా అంతే స్థాయిలో అభిమానులు ఉంటారా ? ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్స్ ఉంటారా ? అంటే అవును ఇది నిజమే అని నిరూపించింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి. ఈమె కూడా బన్నీలాగే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అంతే కాకుండా ఈమె ఇన్స్టా గ్రామ్ లో బన్నీ కి సంబంధించిన పోస్ట్ లు, పిల్లల వీడియోలను మరియు తన ఫోటోలను కూడా పోస్ట్ చేయడానికి అలవాటు పడింది. దీనితో బన్నీ అభిమానులు సైతం స్నేహ రెడ్డికి అభిమానులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే స్నేహ రెడ్డి ఇన్స్టా గ్రామ్ కి సంబంధించి ఒక రికార్డును క్రియేట్ చేశారు.
సినిమా రంగంలో హీరోకి భార్యగా ఉండి సినిమా రంగంతో సంబంధం లేని వారిలో ఎక్కువ సంఖ్యలో ఇన్స్టా గ్రామ్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుని ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది. ప్రస్తుతం అల్లు స్నేహ రెడ్డికి ఇన్స్టా గ్రామ్ లో 4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఉన్న చాలా మంది హీరోయిన్ లకు ఈ స్థాయిలో ఫాలోవర్స్ లేరు. కాబట్టి ఈమె ఫాలోయింగ్ చూసి వారంతా తట్టుకోలేక కుల్లుకుంటున్నారు. కంగ్రాట్స్ స్నేహారెడ్డి గారు.