టాలీవుడ్
హీరో నటసింహ
బాలకృష్ణ నిన్న తన 61వ జన్మదినాన్ని వైభవంగా జరుపుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్
సినిమా అఖండ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.
యువ నిర్మాత
మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ఘనంగా నిర్మిస్తున్న ఈ సినిమాని
బోయపాటి శ్రీను తీస్తుండగా ఎస్
థమన్ సంగీతం అందిస్తున్నారు.
బాలయ్య ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తుండగా
యువ భామ ప్రగ్య
జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ
సినిమా నుండి విడుదలైన రెండు టీజర్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
మంచి
మాస్ అంశాలతో పాటు భారీ యాక్షన్ అంశాలతో కూడిన ఎంటర్టైనర్ గా ఈ
మూవీ తెరకెక్కుతున్నట్లు టాక్. ఇక ఈ
మూవీ తరువాత గోపీచంద్ మలినేని తో
బాలయ్య ఒక
మూవీ చేయనున్నారు. మైత్రి
మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ అధికారిక ప్రకటన నిన్న విడుదలైంది. అయితే నిన్న తన జన్మదినం సందర్భంగా ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా
బాలయ్య మాట్లాడుతూ, తన కెరీర్ లోని మరచిపోలేని చిత్రాల్లో
ఆదిత్య 369 ఒకటి అని, త్వరలో తన దర్శకత్వంలో ఆ
మూవీ కి సీక్వెల్ గా
ఆదిత్య 999
మూవీ ఉంటుందని అన్నారు.
అది మాత్రమే కాక ఆ
సినిమా లో తనతో పాటు తనయుడు
మోక్షజ్ఞ కూడా నటించనున్నారని, తామిద్దరం అందులో
తండ్రి కొడుకులం కాదని, ఇద్దరివీ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలని అన్నారు బాలయ్య. తప్పకుండ ఆ మూవీ తమ ఫ్యాన్స్ తో పాటు
ఆడియన్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుంటుందని
బాలయ్య ఆశాభావం వ్యక్తం చేసారు. మొత్తంగా
మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ విషయమై
బాలయ్య చేసిన ఈ ప్రకటన తో నందమూరి ఫ్యాన్స్ లో అమితానందం వెల్లివిరుస్తోంది ..... !!