రికార్డును సృష్టిస్తోంది. పసిడి బాట1
ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. అలాగే మరో ముఖ్యమైన పాత్రలో హీరోయిన్ పూర్ణ కనిపించనుంది. అయితే ఈ చిత్రం వస్తున్న ప్రతి అప్డేట్ కి అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది . అయితే మొన్న మే 28న సినిమా నుంచి అప్డేట్ వస్తుంది అని రూమర్ వచ్చింది కానీ అది జరగలేదు. దీనితో బాలకృష్ణ అభిమానులు కొంచెం నిరాశకు గురయ్యారు. ఇది ఇలా ఉంటే వచ్చే జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్డేట్ రాబోతుంది అని మూవీ టీం ఆఫీషల్ గా ప్రకటించారు. అదేంటి అంటే ఈ సినిమా నుంచి ఒక మాస్ పోస్టర్ ని బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు అంట. ఈ విషయం తెలిసిన అభిమానులు కొంచెం ఆనందంగా మరియు కొంచెం బాధగా ఉన్నారు.
ఎందుకంటే ఆ రోజు ఈ సినిమా నుంచి అందరూ టీజర్ వస్తుంది అని అనుకున్నారు కానీ ఇప్పుడు జస్ట్ పోస్టర్ అని అనడంతో కొంచెం నిరాశలో ఉన్నారు. ఇక ఈ సినిమా మీద అంచనాలని ఈ పోస్టర్ ఇంకా ఎంత పెంచుతుందో వేచి చూడాలి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలిసిందే. చిన్న టీజర్ లోనే బాలయ్య విశ్వరూపం చూపించారు బోయపాటి ఇంకా సినిమాలో ఆయన ఎలా ఉంటారో విడుదల వరకు వేచి చూడాలి.