రొమాంటిక్ సీన్స్ పై పరిణితి చోప్రా షాకింగ్ కామెంట్స్ !
సినిమాలలో హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలకు యూత్ బాగా కనక్ట్ అవుతూ ఉంటారు. ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా బిసి సెంటర్ల మాస్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈమధ్య కాలంలో ఇంటిమేట్ సీన్స్ కంటే సినిమాలోని కథకు ప్రాముఖ్యత పెరిగినప్పటికీ ఇప్పటికీ యూత్ కు నచ్చే ఇంటిమేట్ సీన్స్ సినిమా విజయానికి కీలక మంత్రంగా భావిస్తున్నారు.
అంతేకాదు ఆమె ఇదే ఇంటర్వ్యూలో మరొక ట్విస్ట్ ఇస్తూ ఇలాంటి సీన్స్ నటిస్తున్నప్పుడు కొంతమంది హీరోలు ఎడ్వాంటేజ్ తీసుకుని తమతో అసబ్యంగా ప్రవర్తిస్తారని ఈ విషయాలు ఆ సీన్ షూట్ చేస్తున్న దర్శకుడుకి కూడ తెలియదు అంటూ కామెంట్ చేసింది. అయితే కొందరు హీరోలు మటుకు చాల సభ్యతగా ఉంటారని అందువల్ల ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ లో ఏహీరో ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కాబట్టి అంచనా వేయడం కష్టం అని అంటోంది.
పరిణితి చోప్రా మాటలు ఇలా ఉంటే బాలీవుడ్ విలన్ పరేష్ రావల్ కామెంట్స్ మరొక విధంగా ఉన్నాయి. హీరోయిన్స్ ను రేప్ చేసే సన్నివేశాలలో నటించి తాను ఇబ్బంది పడిన అనేక సందర్భాలను గుర్తుకు చేసుకున్నాడు. ముఖ్యంగా అలాంటి సీన్స్ లో నటించిన తరువాత తిరిగి అదే హీరోయిన్ తో మరొక సన్నివేశంలో అభిమానంగా నటించడం తనకు మరొక సమస్య అంటూ జోక్ చేసాడు. అయితే హీరోలు హీరోయిన్స్ ఇన్ని కష్టాలు పడుతున్నప్పటికీ ఆ విషయాలు పట్టించుకోకుండా ఇంటిమేట్ సీన్స్ ఎంజాయ్ చేయడం ప్రేక్షకుల అలవాటు..