తారక్ వ్యక్తిత్వంపై ఆ విలన్ సంచలన వ్యాఖ్యలు..?
తాజాగా ఆయన మాట్లాడుతూ.. "తారక్ కి అసాధారణమైన మేధాశక్తి ఉంది. మీరు డాన్స్ గాని పాట గాని ఇంకా మరేతర కళ అయినా చెప్పండి.. తారక్ పర్ఫెక్ట్ గా చేయగలరు. ఎంతటి కష్టతరమైన కళ లో అయినా ఆయన పూర్తిస్థాయిలో పరిపూర్ణత సాధించగలరు. ప్రతి దాంట్లో అతను తన సత్తా చాటుతారు," అని అజయ్ చెప్పుకొచ్చారు.
"ఒక వ్యక్తిగా తారక్ ఒక జెమ్(మాణిక్యం). ఒక వ్యక్తి మన వాడు అని తారక్ అనుకుంటే అతనితో కలసి ఉండేందుకు తారక్ ఎంత దూరమైనా వెళ్తారు. జీవితాంతం వారికి అండగా ఉండేందుకు తారక్ సిద్ధపడతారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం తారక్ కి ఉంది, " అని అజయ్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా చెప్పారు.
ఇకపోతే స్టార్ సెలబ్రిటీల నుంచి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ఎందరో తారక్ మంచి వ్యక్తిత్వం గురించి ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ కూడా తారక్ గురించి చెబుతూ ఆయన ఎంత గొప్ప సహాయం చేసినా పబ్లిసిటీ కోసం అసలు వెంపర్లాడరని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. అనంతరం కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లతో కలసి సినిమాలు చేయనున్నారు.