ఎన్టీఆర్ సినిమాలో వినాయక్ కి నచ్చని సన్నివేశం ఏదో తెలుసా..?

Divya

దర్శకుడు వి వి వినాయక్  ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి తీసిన సినిమా"ఆది". ఈ సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. ఈ సినిమా 2002 లో విడుదలై ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఒకానొక సమయంలో రాజమౌళి తీసిన సింహాద్రి సినిమా తీయడానికి గల కారణం ఆది సినిమానే అని  రాజమౌళి తెలిపారు. ఆ సినిమా తీసిన తర్వాత డైరెక్టర్ వి.వి.వినాయక్ తో పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా సినిమా చేయడానికి చాలా ఆత్రుత పడ్డారు.


ఇక 2004లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా "సాంబ". ఈ సినిమా విడుదలై 17 సంవత్సరాలు అవుతోంది. ఎన్టీఆర్ అభిమానులు సాంబ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . అంతేకాకుండా బిజినెస్ పరంగా కూడా బాగా జరిగింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఓ మోస్తారు గా నిలిచింది ఈ సినిమా. ఇదంతా ఇలా వుండగా.. ఈ చిత్రంలో దర్శకుడు వి.వి.వినాయక్ కి ఒక సన్నివేశం నచ్చలేదట.

డైరెక్టర్ ఆ సీన్ నచ్చకపోవడంతో ఆ సీన్ ని పక్కన పెట్టేశారు. కానీ అందులోని సభ్యులు మాత్రం ఆ సీన్ పెట్టొచ్చు కదా అని ఫోర్స్ చేయడంతో తనకు ఇష్టం లేకపోయినా సీన్ పెట్టాడట. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో ఆ సీన్ చూసి సినీ ప్రేక్షకులు విమర్శించారట. దీంతో అనవసరంగా ఆ సీన్ ని పెట్టానే అని అనుకున్నాడట. ఆ సీన్ ఏమిటంటే... సాంబ సినిమాలో హీరో యొక్క అక్క,  భర్త గారి అన్నయ్య అంటే విలన్ ప్రకాష్ రాజ్, హీరో వాళ్ళ పొలం కోసం ఆమెను వేధించడం మొదలు పెడతాడు. ఇక అంతే కాకుండా హీరో అక్క పై తన చిన్న తమ్ముడితో అత్యాచారం చేయించే విధంగా అతడిని బాగా రెచ్చ గొడతాడు ప్రకాష్ రాజ్. ఆ సమయంలో ప్రకాష్ రాజ్ భార్య అడ్డుకోవడానికి వెళితే... నువ్వు ఎక్స్ట్రాలు చేయకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ వాడు దారి తప్పి నీ మీదకు వచ్చాడు అంటే నిన్ను కాపాడడం నా తరం కూడా కాదు. అంటూ ఆమెను బెదిరిస్తాడు. ఈ సీన్ చేయడం వి.వి.వినాయక్ కు అస్సలు ఇష్టం లేదట. అంతేకాకుండా దీనిపై పలు వర్గాల వారు నెగిటివ్ కామెంట్లు చేశారు. దీంతో వినాయక్ బాగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: