ఇలియానకు అందుకే తమిళ్ లో అవకాశాలు రాలేదా?
ఒక్క తెలుగులోనే కాదు తమిళ్ , హిందీ చిత్రాల్లొ కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.. హిందీ లో ఎక్కువగా తన సినిమాలు రావాలని అనుకుంది. దాంతో అటు వైపు వెళ్ళింది. మల్లీ ఇటు తిరిగి రాకుండా పోయింది.ఆమెకు సౌత్ లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇది ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్న సంగతి.కాగా, దీని వెనుక అసలు కారణం వేరే ఉందని ప్రముఖ దర్శక నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
కొన్ని పరిస్థితుల వల్ల తమిళ పరిశ్రమలలో నిర్మాత ల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి.విక్రమ్ హీరోగా తెరకెక్కాల్సిన 'నందం' అనే సినిమాలో నటించాల్సి ఉందట.అందుకోసం ఈమె రూ.40 లక్షలు అడ్వాన్స్ గా కూడా తీసుకుంది.అనుకోని కారణాల వల్ల ఆ సినిమా మొదటి లోనె ఆగిపొయింది.అడ్వాన్స్ గా తీసుకున్న రూ.40 లక్షలు తిరిగి ఇవ్వాల్సిందిగా నిర్మాత ఇలియానాను అడిగారు. కానీ అమ్మ డు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. నటరాజు తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించారు. వాళ్ళు కూడా ఈ సమస్యను పరిష్కరించలెక పోయారు. ఈ ఒక్క కారణం తో ఆ పరిశ్రమలో ఇల్లి పేరు వినిపించలేదు.. ఆ ఒక్క తప్పు వల్లే తమిళ్ లో అవకాశాలు రాలేదని సినీ వర్గాలు అంటున్నారు. ఫ్యుచర్లొ అయిన వస్తుందేమో చూడాలి.. ప్రస్థుతం ఈమె వరుస సినిమా లలో నటిస్తుంది..