సుమకి పోటీగా రాజీవ్..?

Suma Kallamadi
విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు రాజీవ్ క‌న‌కాల‌. మొద‌ట్లో విలన్ పాత్ర‌ల్లో చేసినా.. ఆ త‌ర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేశారు. ఇంకొన్ని సినిమాల్లో సైడ్ హీరోగా న‌టించి, మెప్పించారు. ఇప్ప‌టికీ వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంటున్నాడు ఈ న‌ట‌డు. రాజీవ్ భార్య సుమ కనకాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆమెకు ఉన్న క్రేజ్ అలాంటిది మ‌రి.

అయితే ఇప్పుడు సుమ యాంక‌ర్‌గా ఎంత ఫేమ‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక్క‌డ అస‌లు విస‌యం ఏంటంటే సుమ కి పోటీగా రెచ్చిపోవడానికి రెడీ అవుతున్నాడు రాజీవ్ క‌న‌కాల‌. సుమ‌కు పోటీయా అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. సుమ ఇప్పుడు టాలీవుడ్ ఏ స్థాయిలో పేరు సంపాదించుకుందో తెలిసిందే. అయితే రాజీవ్ కనకాల కూడా త్వ‌ర‌లోనే బుల్లితెరపై మెప్పించడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు చాలా ప్రోగ్రామ్ ల‌లో సుమ యాంకరింగ్ చేసిన వాటిల్లో గెస్ట్ గా పాల్గొన్న రాజీవ్ అక్క‌డ కూడా త‌న టైమింగ్‌తో మెప్పించాడు. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు ఏకంగా తాను కూడా ఓ షోలో యాంక‌రింగ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఈ షో కి సంబంధించిన ఓ ప్రోమో విడుదల విడుద‌ల అయి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆ ప్రోమోలో రాజీవ్ కనకాల యాంక‌రింగ్ చేయనున్నట్లు కనిపించ‌డం విశేషం.

బుల్లితెర ఛాన‌ల్ ఈటీవీలో నిన్న విడుద‌లైన షో 'రెచ్చిపోదాం బ్రదర్ బాగానే ఆక‌ట్టుకుంటోంది. ఇందులో రాజీవ్ కనకాల మొద‌ట‌గా ఎంట్రీ ఇస్తూ తాను రావడం పక్కా అంటూ బుల్లితెర‌పై త‌న యాంక‌రింగ్ గురించి హింట్ ఇచ్చాడు. ఇక దాని తర్వాత జై లవకుశ మూవీలోని రావణ సాంగ్‌తో దుమ్ములేపాడు. తాను ఏ షో అయినా రెడీ అంటూ పంచ్ డైలాగ్ చెప్పాడు. ఇక ఈ షో ప్ర‌తి సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ఈటీవీలో వ‌స్తుంద‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: