సుధీర్, రేష్మి ఈ పేర్లు వినగానే అందమైన ప్రేమ జంట అని ప్రతి తెలుగు వారి మనసుకు అనిపిస్తుంది. అంతగా వీరి జంట తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వీరి జంటకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినీ సెలబ్రిటీలను మించి వీరి ఫాలోయింగ్ పెరిగిపోయిందని అర్దం చేసుకోండి. వీరు ఎంతగా ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారో, వీరి జంట తెరపై కనిపిస్తే చాలు ఇక ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవు. అంతగా ఏదో మ్యాజిక్ దాగి ఉంది వీరి జంటలో. కళ్ళతో వీరి మధ్య నడిచే ప్రేమ చిలిపి మాటలు అభిమానులను అలరిస్తాయి. తెలుగు బుల్లితెరపై రొమాంటిక్ కపుల్ గా ఎంతో ఆదరణ పొందుతోంది ఈ జంట. ఇటు జబర్దస్త్ కామెడీ షో లోనూ, అటు ఢీ షో లోనూ వీరి జంట కనుల పండగే. అందుకే వీరికి ప్రోగ్రామ్స్ కూడా భాగానే లభిస్తాయి. వీరు కనిపిస్తే ఆ షోకి వచ్చే రేటింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని టాక్.
ఏదైనా పండగ వచ్చింది అంటే వీరి ప్రోగ్రామ్ తప్పక ఉండాల్సిందే, అంతగా క్రేజ్ సంపాదించుకొంది వీరి జంట. అయితే వీరిద్దరు ఇదంతా ఆన్ స్క్రీన్ పై మాత్రమే అని చాలా సందర్భాల్లో చెప్పారు. పలు ఇంటర్వ్యూ లో పాల్గొన్న వీరు. వీరి మధ్య ఉన్న ప్రేమ గురించి అడుగగా మా మధ్య ఎలాంటి ప్రేమా లేదని కేవలం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మాత్రమే ఆలోచిస్తాము తప్ప వేరేమీ లేదని పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అటు సుధీర్ సైతం, రేష్మి నేను మంచి స్నేహితులం మాత్రమే. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు కనీసం నా దగ్గర ఆమె ఫోన్ నంబర్ కూడా లేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రేక్షకులు మాత్రం వీరిద్దరూ ఒకటైతే చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక రేష్మి , సుధీర్ ల పెళ్లిళ్ల విషయానికొస్తే తాజాగా ఓ రూమర్ అందరినీ షాక్ కు గురి చేస్తోంది. రేష్మి ఇప్పటికే సినిమాలు, షోలు చేస్తూనే ఉంది కెరీర్ పరంగా మంచి స్పీడ్ మీద ఉన్నప్పటికీ తనని పెళ్లి చేసుకోవాల్సిందే నని ఇంట్లో ఒత్తిడి పెంచారట. దాంతో తప్పక ఆమె పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో రేష్మి పప్పనం పెట్టబోతోందన్న వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కానీ ఇది ఎంతవరకు నిజమో రేష్మినే క్లారిటీ ఇవ్వాలి. ఇక సుధీర్ దృష్టి అంతా పూర్తిగా కెరీర్ పైనే ఉంది. కాబట్టి ఇప్పట్లో పెళ్లి ప్రస్తావన లేదని కానీ తన మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లి గురించి తప్పక ఆలోచిస్తానన్న అభిప్రాయాన్ని తన సన్నిహితులతో పంచుకున్నట్లు తెలుస్తోంది. కానీ తెరపై మ్యాజిక్ చేసే ఈ జంట రియల్ లైఫ్ లోనూ ఒకటవ్వాలని ఆకాంక్షిస్తున్నారు ప్రేక్షకులు. మరి కాలం మారి వీరిద్దరూ ఒక్కటైతే ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవు.