యాంకర్ గా చేసి హీరోయిన్ గా మారిన తారలు ఎవరంటే.?
అలాగే ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా మొదటగా యాంకర్ గానే తన కెరీర్ ను మొదలు పెట్టింది.ఇప్పటికి యాంకరింగ్ చేస్తూనే వస్తుంది మద్య మద్యలో అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. 2015 లో చంద్రిక సినిమా తో శ్రీముఖి హీరోయిన్ అవతారం ఎత్తింది.మెగా డాటర్ నీహారిక కూడా ఈటివిలో డాన్స్ ప్రోగ్రామ్ " ఢీ "షో కి యాంకర్ గా పని చేసి, ఆ తరువాత “ముద్దపప్పు ఆవకాయ్” అనే వెబ్ సిరీస్ లో మెయిన్ రోల్ లో నటించారు. ఆ తరువాత “ఒక మనసు” అనే సినిమా ద్వారా ఆమె వెండితెరకు హీరోయిన్ గ పరిచయం అయ్యారు. ఇంకా ఈ లిస్ట్ లో బాగా పాపులర్ అయిన పేరు అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం ఈవిడ టాప్ యాంకర్ గా రాణిస్తుంది. 2003 లోనే ఎన్టీఆర్ నాగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 2013 లో వచ్చిన జబర్దస్త్ లో యాంకర్ గా నటించింది. తరువాత సోగ్గాడే చిన్ని నాయనే, రంగస్థలం, f2 వంటి సినిమాల్లో నటించింది.
రష్మీ గౌతమ్ ఈ పేరుకి పెద్ద పరిచయం అక్కర్లేదని చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న టాప్ యాంకర్ లలో రష్మీ కూడా ఒకటి. 2007 లో వనితా టీవీ లో యువ అనే ప్రోగ్రామ్ ద్వారా రష్మీ యాంకర్ గా పరిచయం అయింది. అంతకన్నా ముందే ఆమె సినిమాలలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వచ్చింది. 2016 లో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమా తో రష్మీ హీరోయిన్ గా పరిచయం అయింది. అలాగే స్వాతి కూడా అంతే. మొదటిలో కలర్స్ ప్రోగ్రాం లో యాంకర్ గా పని చేసినది స్వాతి ఆ తరువాత ఇంకా తన పేరు కలర్స్ స్వాతి గా గుర్తుండిపోయింది. . ఓ వైపు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ, ప్లే బ్యాక్ సింగర్ గా కూడా రాణిస్తుంది. !