ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం రాసిన లేఖ వైరల్..

Divya

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకులలో దిగ్గజ ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఒకరు. ఈయన మరణం సినీ ఇండస్ట్రీకి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన పాటలు ప్రేక్షకులను, అభిమానులను కలకాలం అలరిస్తూనే వుంటాయి. అలా ఆయన పాటలు వింటుంటే చాలు, ఆయన ఇంకా మన చుట్టూ ఉన్నట్టే అనిపిస్తుంది.ఎస్పీ బాలసుబ్రమణ్యం 16 భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడిన ఆయన,  గొంతు మూగబోయింది అంటే ఇంకా నమ్మశక్యం కావడం లేదు.

ఇక ఎస్పీ బాలసుబ్రమణ్యం కేవలం గాయకుడిగానే కాకుండా, డబ్బింగ్ ఆర్టిస్ట్, సంగీత దర్శకుడు కూడా.. అంతేకాదు బుల్లితెరపై ప్రసారం అయిన ఎన్నో మ్యూజిక్ షోలకు జడ్జ్ గా కూడా వ్యవహరించారు. ఇంతటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి అందరిలోనూ కలుస్తూ,నేను కూడా ఒక సామాన్యుడిని అని నిరూపించారు. ఈయన చలన చిత్ర రంగం లో మంచి స్థానాన్ని ఏర్పరుచుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈయన 40 వేలకు పైగా పాటలు పాడడం, పవి ప్రజాదారణ బాగా పొందడం లాంటి ఎన్నో కారణాల చేత ఈయనకు కేంద్ర ప్రభుత్వం నుంచి 2001 లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వం నుంచి ఏకంగా 25 విభాగాలలో నంది పురస్కారాలు  అందుకున్నారు.


ఇదిలా ఉండగా, ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు, తన స్వతహాగా రాసిన లేఖ  ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన ఒక కార్యక్రమం నిమిత్తం వివరణ ఇస్తూ.. కొన్ని చిన్నచిన్న అభ్యర్థనలను మీరు మన్నించాలని కోరుతూ.. నా పేరు ముందు'డాక్టర్', పద్మభూషణ్,'గాన గంధర్వ, వంటి విశేషణలు వేయకండి అని కోరారు.. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈయన ఎన్ని సాధించినప్పటికీ, అతి సాధారణ వ్యక్తిలా జీవనం గడపాలని కోరుకున్నారు. ఇక ఏది ఏమైనా ఎస్పీ బాలసుబ్రమణ్యం లేని లోటు.. మనకి బాగా కనిపిస్తోంది. ఈయన మరణం తో ఇప్పటికీ సినీ ఇండస్ట్రీ కోలుకోలేకపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: