జబర్దస్త్ బ్యూటీ అనసూయను ప్రస్తుతం యంకర్ అనేకంటే యాక్టర్ అనడమే బెటర్ అనిపిస్తోంది. ఎందుకంటే అనసూయ ప్రస్తుతం టీవీ షోల కంటే సినిమాల్లోనే ఎక్కువ బిజీగా ఉంటోంది. మొదట్లో సినిమాల్లో ఐటమ్ సాంగ్ లు చిన్న చిన్న రోల్స్ చేసిన అనసూయ ప్రస్తుతం లాంగ్ లెన్త్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అదరగొడుతోంది. రంగస్థలం సినిమాలో రంగమత్త క్యారెక్టర్ చేసిన హాట్ బ్యూటీ తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో అనసూయ నటనకు మంచి మార్కులు పడటంతో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బిజీగా మారింది. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడీ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ఫ సినిమాలోనూ అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది.
ఇవి ఇలా ఉండగానే అనసూయకు మరో బంపరాఫర్ వచ్చినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమాలోనూ అనసూయకు అవకాశం దక్కిందట. సినిమాలో ఓ ఆలయ పూజారి భార్యగా అనసూయ నటించబోతుందట. అయితే తప్పిపోయి అనంతపురం చేరుకున్న ఆమెను బాలకృష్ణ రక్షిస్తాడట. అంతే కాకుండా ఈ సినిమాలో అనసూయ పాత్ర దాదాపు 20 నిమిషాలు ఉండబోతుందని టాక్. సినిమాలో అనసూయ పాత్ర ఓ కథను మలుపు తిప్పేలా ఉంటుందట. ఇదిలా ఉండగా బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సింహా లెజెండ్ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో అఖండ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో విలన్ గా హీరో శ్రీకాంత్ నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పుడు అనసూయ కూడా ఈ సినిమాలో భాగమవ్వడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.