ఆ సినిమా కోసం పవన్ త్రిపాత్రాభినయం నిజమేనా ?

VAMSI
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులు అల్లాడిపోతారు. రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత కం బ్యాక్ మూవీగా వచ్చిన పింక్ రీమేక్ మూవీ వకీల్ సాబ్ ఎంతలా ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ముఖ్యంగా ఆడవారికి బాగా కనెక్ట్ అయింది. మరో సారి ఆడవారికి నేనున్నాను అని సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ ఒక సందేశాన్నిచ్చాడు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫుల్ గా ఎంజాయ్ చేసారని చెప్పొచ్చు. ఇటువంటి కరోనా పరిస్థితుల్లో కూడా మంచి విజయాన్ని సాధించి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి కథ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు అనే భరోసా ఇచ్చింది. ఇదే ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు చక చకా రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనిలో ఉన్నారు.
ఈ రెండు సినిమాలలో ఒకటి మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియం" సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మరొక మూవీ   "హరిహర వీరమల్లు". ఈ సినిమా చారిత్రాత్మక నేపధ్యంతో రూపుదిద్దుకుంటోంది. దీనికి ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఎప్పుడూ చూడని విధంగా చూపించనున్నట్లు ఇప్పటికే క్రిష్ తెలియచేశారు. ఈ సినిమా షూటింగ్ కొంతభాగం జరుపుకుని కరోనా కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇటీవలే పవన్ కు కోవిడ్ సోకడంతో డాక్టర్ల సలహా మేరకు 2 నెలలకు పైగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ చిత్రపురిలో వైరల్ అవుతూ ఉంది. హరిహర వీరమల్లు లో పవన్ కళ్యాణ్ మూడు పాత్రలను పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనితో ఈ వార్త తెలిసిన పవన్ ఫ్యాన్స్ ఇందులో నిజముందా లేదా అని తెలుసుకోకుండా ఫుల్ వైరల్ చేసేస్తున్నారు. చారిత్రాత్మక సినిమా కాబట్టి ఉండే అవకాశం ఉందా ? లేదా ? అని సినీ వర్గాలు సైతం చెవులు కొరుక్కుంటున్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు కాబట్టి ప్రస్తుతానికి ఒక గాసిప్ లా మిగిలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: