బిగ్ బాస్ రియాలిటీ షో మొదట హిందీలో ప్రారంభం అయింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న ఈ రియాలిటీ షో ఇప్పటి వరకు మొత్తం పద్నాలుగు సీజన్ లను పూర్తి చేసుకుంది. 14వ సీజన్ గతేడాది అక్టోబర్ లో ముగిసింది. కాగా ఫైనల్ లో రుబీనా ధిలైక్ విజేతగా నిలిచారు. ఇక ఇప్పుడు ఈ రియాలిటీ షోకు పదిహేనవ సీజన్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 15వ సీజన్ కూడా ప్రారంభం అవ్వాల్సింది. కానీ కరోనా విజృంభన తో ప్రారంభించలేకపోయారు. ఇక ప్రస్తుతం హౌస్ లోకి వెళ్లే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తోంది. అంతే కాకుండా హౌస్ లోకి వెళ్లే కొంతమంది పేర్లు ఇప్పటికే ఖరారు అయినట్టు టాక్ వినిపిస్తుంది. వారిలో బాలిక వద్దు సీరియల్ నటి నేహా మర్ధ హౌస్ లోకి వెళ్లడం దాదాపు కాయం అయినట్టు సమాచారం. అంతే కాకుండా సనయా రాణి, దివ్యంక త్రిపాఠి, దిశ వకాని పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరో వైపు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి కూడా బిగ్ బాస్ లోకి వెళుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేవారిలో ఎక్కువమంది సెలబ్రెటీలు వివాదాల్లో చిక్కుకున్న వారే ఉంటారు. వివాదాల్లో నిలిచిన వారైతేనే టీఆర్పీ భాగా వస్తుందని మేకర్స్ భావిస్తారు. అయితే రియా చక్రవర్తి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం ఆమె సుశాంత్ అభిమానులు ఓడించాలనే కోరుకుంటారు. దానికి కారణం రియా చక్రవర్తి డ్రగ్స్ అలవాటు చేసి సుశాంత్ చనిపోవడానికి కారణం అయ్యిందనే అభియోగాలు ఉన్నాయి. ఇక ఈ సీజన్ లో కూడా సీరియల్ స్టార్ట్స్ ను ఎక్కువగా తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ వచ్చేది టీవీలో కాబట్టి సీరియల్ ప్రేక్షకులు ఈ షో చూడాలంటే సీరియల్ నటీనటులు కూడా భాగమైతే ప్లస్ అవుతుంది. గతంలోనూ బిగ్ బాస్ లో ఎక్కువగా కనిపించింది సీరియల్ నటీనటులే. అంతే కాకుండా సినిమా వాళ్ళను ఓడించి సీరియల్ వాళ్ళు టైటిల్ దక్కించుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: