"సర్కారు వారి పాట" లో విలన్ గా అతను ఖరారేనా ?
ఒకప్పుడు యాక్షన్ హీరోగా రాణించిన హీరో అర్జున్ ఇప్పుడు ప్రతినాయకుడి పాత్రలోనూ అదుర్స్ అనిపిస్తున్నారు. లై సినిమాతో విలన్ గా సత్తా చాటిన అర్జున్ ఆ తర్వాత అదే తరహా పాత్రల వైపు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సర్కారు వారి పాట చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం ఇప్పటి వరకు బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, కోలీవుడ్ ప్రముఖ నటుడు అరవిందస్వామి, ఉపేంద్ర, కిచ్చా సుదీప్ వంటి పలువురు ప్రముఖుల పేర్లు వినిపించగా ఇప్పుడు యాక్షన్ హీరో అర్జున్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విలన్ పాత్రపై చాలా కీలకమని ఆ పాత్రకు అర్జున్ అయితే సరిగ్గా సరిపోతారని ఆయన చిత్ర యూనిక్ సెలెక్ట్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
అయితే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. భారీ బ్యాంకుల కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఫుల్ బజ్ క్రియేట్ అయింది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఇలా వరుస బ్లాక్ బస్టర్ ట్రాక్ లో దూసుకుపోతున్న మహేశ్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం కావడంతో సర్కారు వారి పాట మీద భారీ అంచనాలే నెలకొన్నాయి.