దాంతో మీకేం పని..అమ్మా అక్కా ఆంటీ అని పిలవండి.. ప్రగతి మైండ్ బ్లాక్ రిప్లై.. !

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ లో  హీరోల‌కు, హీరోయిన్ ల‌కు తల్లి, అక్క‌, అత్త లాంటి క్యారెక్ట‌ర్లు చేసి గుర్తింపు తెచ్చుకున్న న‌టి ప్ర‌గ‌తి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో సినిమాలు  చేసిన ప్ర‌గ‌తి త‌న నటన, కామెడీ టైమింగ్ తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. అయితే సినిమాల్లో వ‌చ్చిన గుర్తింపు కంటే సోష‌ల్ మీడియా ద్వారానే ప్ర‌గ‌తికి ఎక్కువ గుర్తింపు ల‌భించింది అనడంలో ఎలాటిం సందేహం లేదు. లేటు వ‌య‌సులోనూ ఘాటు అందాల‌ను ఆర‌బోత‌స్తూ నెట్టింట ప్ర‌గ‌తి చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. ఫోటో షూట్ లు, టిక్ టాక్ వీడియోలు వీటితో పాటు ఫిట్నెస్ వీడియోలు చేస్తూ కుర్రాళ్ల‌ను త‌న‌వైపు తిప్పుకుంటోంది. దాంతో ఆమెకు సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇక సినిమాల‌కు విరామం దొరికినప్పుడ‌ల్లా ప్ర‌గతి లైవ్ లు పెడుతూ అభిమానుల‌తో ముచ్చ‌ట్లు పెడుతుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా సోష‌ల్ మీడియా లైవ్ లోకి వ‌చ్చింది. ఇక సెలబ్రెటీలు లైవ్ లోకి వ‌స్తే నెటిజ‌న్లు ఎలాంటి ప్ర‌శ్న‌లు అడుగుతారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన‌వస‌రం లేదు. సినిమాల గురించి అడ‌గ‌టం మానేసి పుట్టు పూర్వోత్త‌రాలు అడిగేస్తారు. 

ఈ క్ర‌మంలోనే నిన్న (ఆదివారం) లైవ్ లోకి వ‌చ్చిన ప్ర‌గ‌తికి ఓ నెటిజ‌న్ కోపం తెప్పించేలా ప్ర‌శ్నవేశాడు. మీ వ‌య‌సు ఎంత.? అంటూ ప్ర‌శ్నించాడు. దాంతో ప్ర‌గ‌తికి కోపం వ‌చ్చిన‌ట్టు ఉంది. అమ్మా...అక్కా....ఆంటీ అని పిలిచే వ‌య‌సు నాది. నీకు ఎలా పిలవాలి అనిపిస్తే అలా పిలిచేయ్. అంటూ సమాధానం ఇచ్చింది. ఇక మ‌రో నెటిజ‌న్ ప్ర‌గ‌తి ఫిట్నెస్ సీక్రెట్ ను అడిగాడు. మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి...ఎలా ఇంత ఫిట్ గా ఉన్నారు. ఎప్పుడు వ్యాయామం చేయ‌డం ప్రారంభించారంటూ ప్ర‌శ్న‌లు వేశాడు. దానికి ప్ర‌గ‌తి ఆన్సర్ ఇస్తూ...నేను రెండేళ్లుగా వ్యాయామాలు చేస్తున్నా. నాకు ఫిట్ గా ఉండ‌టం న‌చ్చింది. అంతే కాకుండా నా ఎన‌ర్జీ లెవ‌ల్స్ కూడా భాగా పెరిగాయి. అందువ‌ల్లే కంటిన్యూ చేస్తున్నా అంటూ సామాధానం ఇచ్చింది. ఇక రిలీజ్ కు సిద్దంగా ఉన్న మీ నెక్స్ట్ సినిమా ఏదని ప్ర‌శ్నించ‌గా ఎఫ్ 3 మొద‌ట రిలీజ్ అవుతుంద‌ని స‌మాధానం ఇచ్చింది. ఇక ఆదివారం పూట అలా అభిమానుల‌తో స‌ర‌దాగా ప్ర‌గ‌తి ముచ్చ‌టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: