తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నటులలో కృష్ణ కూడా ఒకరు. 1964 ముందు పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణ, 1965 లో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు, ఆ తర్వాత గూడచారి 116. ఇక ఈ సినిమాలు సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి. ఇక అప్పటి నుంచి మొదలు దాదాపుగా 350 సినిమాలకు పైగా నటించాడు. అలాంటి సినిమాలలో ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీస్ ఏంటో చూద్దాం.
1). అల్లూరి సీతారామరాజు:
పద్మాలయా స్టూడియోస్ పతాకంపై సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ కు పరిచయం చేసిన తొలి సినిమా చిత్రం అల్లూరి సీతారామరాజు. ఇది స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర పై తీసిన చారిత్రాత్మక చిత్రం. ఈ సినిమాలో కృష్ణ, విజయనిర్మల ప్రధాన నటులుగా నటించారు. ఈ చిత్రం టాలీవుడ్ లోనే అతి పెద్ద బ్లాక్ బాస్టర్ లలో ఒకటి.
2). గూడాచారి 116:
ఈ సినిమా కృష్ణ కి మూడవ సినిమా. ఈ సినిమా ద్వారా కృష్ణ సినీ ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్నాడు అని చెప్పవచ్చు. అంతేకాకుండా కృష్ణకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు.
3). ప్రైవేటు మాస్టర్:
1967లో కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రామ్మోహన్ రావు, కాంచన మరియు కృష్ణ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నెగటివ్ క్యారెక్టర్ పోషించాడు.
4). మంచి కుటుంబం:
ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, కాంచన,కృష్ణ అలాగే విజయనిర్మల నటించారు. మంచి ఎమోషనల్ డ్రామా చిత్రం. దీనికి 1968లో వి.మధుసూదనరావు దర్శకత్వం వహించారు.
5). పండంటి కాపురం:
కృష్ణ,ఎస్వీ రంగారావు,విజయ నిర్మల, గుమ్మడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామా చిత్రంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక వెండి వేడుకను ప్రశంసించింది అని కూడా చెప్పవచ్చు.
6). ముందడుగు:
ఈ చిత్రంలో కృష్ణ, శోభన్ బాబు మరియు శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాని 1983లో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు.
7). రామ్ రాబర్ట్ రహీమ్:
ఈ సినిమాలో కృష్ణ,రజనీకాంత్, చంద్రమోహన్ మరియు శ్రీదేవి లు కలిసి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం. ఈ చిత్రానికి విజయ నిర్మల 1980లో దర్శకత్వం వహించారు.
8). సింహాసనం:
సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం వహించిన సినిమా సింహాసనం. ఈ సినిమాను పద్మాలయ స్టూడియోస్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమకు అనేక రికార్డులను సంపాదించింది.
9). నెంబర్ వన్:
ఈ సినిమాని ఎస్.వి.కృష్ణారెడ్డి నిర్మించారు. ఇందులో కృష్ణ,సౌందర్య ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకి krishna REDDY' target='_blank' title='ఎస్ వి కృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఎస్ వి కృష్ణారెడ్డి సంగీతం వహించారు. అంతే కాకుండా ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలలో అతి పెద్ద బ్లాక్ బాస్టర్ లలో ఒకటిగా చేరింది.
10). మోసగాళ్లకు మొనగాడు:
ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల, గుమ్మడి, కైకాల సత్యనారాయణ తదితరులు నటించారు.