ఎస్పీ బాలసుబ్రమణ్యం హత్య చేయబడ్డారు : డైట్ స్పెషలిస్ట్

Divya


గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం  గతేడాది సెప్టెంబర్ 25న మరణించిన విషయం అందరికి తెలిసిందే. కరోనా వైరస్ బారిన పడిన బాల సుబ్రహ్మణ్యం , వయస్సు రీత్యా ఆయన తిరిగి ఈ మహమ్మారి నుంచి కోలుకోలేకపోయారు. సుమారుగా రెండు వారాలపాటు చెన్నై ఎంజీఎం హాస్పిటలో కరోనాతో పోరాడి తుది శ్వాస  విడిచారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం .అయితే ఆయన మరణించి 8 నెలల గడుస్తుండగా ,ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు  ప్రముఖ డైట్ స్పెషలిస్ట్ వీరమాచినేని రామకృష్ణ.


విజయవాడకు చెందిన వీరమాచినేని స్పెషల్ డైట్ స్పెషలిస్ట్ . ఈయన  మధుమేహం ,బీపీ , ఊబకాయం వంటి వ్యాధులకు డైట్ ను ఇస్తూ, వారి ఆరోగ్యాన్ని మరింత పెంచే పనిలో ఉంటారు. అయితే ఈయనను కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా నెల్లూరు ఆనందయ్య నాటువైద్యం పై హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ ఇష్యూ గురించి ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న వీరమాచినేని. కరోనా కి సరైన ట్రీట్మెంట్ లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ,కొంతమంది డాక్టర్లు మాత్రం బుద్ధి బుర్ర లేకుండా పనిచేస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


ఈ కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఎస్పీ బాలు హత్య చేసింది ఎవరు?? వీళ్ళు కాదా.. ఆయనను చంపేసి తప్పించుకొని తిరగడం లేదా? అంటూ చెప్పుకొచ్చారు డైడ్ స్పెషలిస్ట్ వీరమాచినేని. బాల సుబ్రహ్మణ్యం అనారోగ్యంతో హాస్పిటల్ కి వెళ్ళాడు. ఏదైనా యాక్సిడెంట్ లో దెబ్బలు బాగా తగిలాయా ?  లేక అనారోగ్యంతో హాస్పిటల్ కి వెళ్ళాడా? లేదు కదా..! హాస్పిటల్ కి నడుచుకుంటూ , చక్కగా పాటలు పాడుకుంటూ వెళ్ళాడు.కాని తిరిగి రాలేదు. ఇక ఎంతమంది ఆయన పై ప్రయోగాలు చేసి చంపారో ?ఆ ప్రయోగాలు ప్రోటోకాల్ లేదా ఎస్పీ బాలు చికిత్సలో లోపాలు ఉన్నాయని  నేను చెప్పడం కాదు.. వందలాది మంది డాక్టర్లు చెప్పారు. అంటూ వీరమాచినేని రామకృష్ణ చెప్పుకొచ్చారు.

హాస్పిటల్ లోకి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళారో.. అనారోగ్యంతో ఉన్నాయనని తీసుకెళ్లి ప్రయోగాలు చేసి చంపేశారు. అన్ని మందులు ఇస్తే, ఆయనే కాదు మనమైన చనిపోతాం. అసలు మనిషి శక్తి ఎంత? వాళ్ళు ఇచ్చే మందులు పవర్ ఎంత? అంటూ చెప్పుకొచ్చాడు.


ఇప్పుడు ఆనందయ్య మందుకు కరోనా తగ్గుతుందని రుజువైనా, మన కేంద్ర ప్రభుత్వం, మీడియా దాన్ని తొక్కి అవతల పడేశారు. ఇలాంటి ఆనందయ్య మందు వచ్చినా వేరే వాళ్ళు మందు తీసుకొచ్చిన లక్షల కోట్ల దోపిడీ కుదరదు కదా ! వ్యాపార ప్రయోజనాల కోసం ఇలాంటి ఆనందయ్య లను ఎంకరేజ్ చేయరు..అంటూ కుండబద్దలు కొట్టారు వీరమాచినేని.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: