బాలకృష్ణ వ్రాసే ఎన్టీఆర్ బుక్ లో ఏమి ఉండబోతోంది ?

Seetha Sailaja
నిన్న ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి బాలకృష్ణ చేసిన కొన్ని కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది తన తండ్రి శతజయంతి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి అన్న సంకేతాలు ఇస్తూ ఇప్పటి వరకు ఎన్టీఆర్ జీవితం పై అనేకమంది వ్రాసిన పుస్తకాల పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు.


వాస్తవానికి తన తండ్రి జీవితం పై చాలామంది పుస్తకాలు వ్రాసినప్పటికీ అవి ఎక్కడా సమగ్రంగా లేవని తన అభిప్రాయం వెల్లడించాడు. అంతేకాదు తన తండ్రి జీవితం పై పుస్తకం వ్రాయాలి అంటే మూలాలలోకి వెళ్లాలని ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం ఎవరు చేయకపోవడంతో ఇప్పుడు తానే ఆప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నాని ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.


అదేవిధంగా ఎన్టీఆర్ జీవితాన్ని పిల్లలకు పాఠ్యాంశం గా పెట్టాలని చెపుతూ ఆయన చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియవలసి ఉంది అన్నాడు. ఇప్పటి వరకు ఎన్నో పుస్తకాలు ఎన్టీఆర్ జీవితం పై వచ్చినప్పటికీ తాను రాయబోయే పుస్తకంలో ప్రజలకు తెలియని చాల విషయాలు ఉండబోతున్నాయి అన్న సంకేతాలు ఇచ్చాడు. ఎన్టీఆర్ పై వ్రాస్తున్న పుస్తకాన్ని ఒక చరిత్ర లా కాకుండా ఒక కథ లా తాను వ్రాయబోతున్నట్లు బాలయ్య వివరణ ఇచ్చాడు.



వాస్తవానికి ఇప్పటికే ఎన్టీఆర్ జీవితంపై రెండు భాగాలుగా బాలయ్య సినిమా చేసాడు. కనీసం తెలుగుదేశం అభిమానులు అంతా ఈ సినిమాను ఒక్కసారి చూసి ఉంటే ఆ మూవీ ఖచ్చితంగా విజయవంతం అయి ఉండేది. ఇప్పుడు బాలయ్య వ్రాయబోయే పుస్తకంలో లక్ష్మీ పార్వతి ప్రస్తావన ఎంత వరకు ఉంటింది అన్నది సమాధానం దొరకని ప్రశ్న. మళ్ళీ ఈ సున్నితమైన విషయం పై రకరకాల చర్చలు జరుగుతాయి. ఎన్టీఆర్ బయోపిక్ సాధించలేని సంచలనం బాలయ్య వ్రాయబోయే పుస్తకం ద్వారా ఎంతవరకు జరుగుతుంది అన్నది రానున్న రోజులలో తేలుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: