రవితేజ కూతురు ఫోటోస్.. వైరల్ ?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఏ ఒక్కరి సపోర్టు లేకుండా వచ్చింది ఎవరంటే మాస్ మహారాజ్ అని చెప్పవచ్చు. తను మొదట పలు సినిమాలలో సైడ్ యాక్టర్ గా నటించేవాడు. ఇక ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని సినీ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత సైడ్ క్యారెక్టర్ లోకి దూరి తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. అయితే కృష్ణవంశీ డైరెక్షన్లో "సింధూరం" సినిమా లో నటించి, తన టాలెంట్ ను బయట పెట్టాడు. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన స్నేహితుడి పాత్రలో కూడా నటించి అందరిని మెప్పించాడు. ఇక పూరి జగన్నాథ్" ఇడియట్" సినిమాతో స్టార్ హీరోగా మారాడు.
ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ సినిమాతో ఆల్ టైం హీరో అనిపించుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో గట్టి పోటీని తట్టుకుంటూ, తన సినిమాలను విడుదల చేస్తున్న రవితేజ ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులతో పంచుకోలేదు. ఎప్పుడో ఒకనొక కాలంలో జరిగిన సినీ ఫంక్షన్లలో మాత్రం తన వైఫ్ గురించి చెప్పాడు. రవితేజకు 2002 వ సంవత్సరంలో కళ్యాణి అనే అమ్మాయితో వివాహం జరిగిందని, వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పాడు. అయితే ఇప్పటికే తన కుమారుడు రాజా ది గ్రేట్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే..
ఇక ఇప్పుడు రవితేజ కూతురు విషయానికొస్తే, ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా,అవి బాగా వైరల్ అవుతున్నాయి. బాగా పెరిగి పెద్దయిన తన కూతురుతో కలిసి రవితేజ దిగిన ఫోటోలు బయటకు రావడం ప్రేక్షకులకు మహదానందంగా అనిపిస్తోంది. ఇక రవితేజ అభిమానులు ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే రవితేజ తనయ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది అని కూడా కామెంట్లు పెడుతున్నారు. ఈమె త్వరలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు దూసుకెళ్తుందని కూడా రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే హీరోయిన్లకు సరిపోయే పోలికలతో వున్న ఈ అమ్మాయి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందో? లేదో?అనేది మాత్రం రవితేజ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.