పెళ్లి తర్వాత కాజల్ లో ఈ మార్పు గమనించారా..?
గతంలో ఓటీటీలో థ్రిల్ చేసిన కాజల్, ఇప్పుడు వెండితెరపై సత్తా చూపిస్తానంటోంది. ఈ థ్రిల్లింగ్ సబ్జెక్ ని జయశంకర్ అనే దర్శకుడు తెరకెక్కించబోతున్నారని సమాచారం. గతంలో పేపర్ బోయ్ అనే సినిమాతో ఆకట్టుకున్న జయశంకర్, కాజల్ కోసం ఓ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ రెడీ చేశారని, దీనికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాతో కాజల్ కెరీర్ మరో మలుపు తిరుగుతుందని అంటున్నారు. ఇటీవలే విటమిన్-షి అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో దర్శకుడు జయశంకర్ ఓటీటీలో హిట్ కొట్టాడు. అదే ఊపులో ఈప్పుడు కాజల్ తో డిఫరెంట్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు జయశంకర్.
విచిత్రం ఏంటంటే.. ఈ ప్రాజెక్ట్ కరోనా సెకండ్ వేవ్ మొదలు కాకముందే ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అప్పటికే కాజల్ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. పెళ్లి తర్వాత తాను చేయబోయే పాత్రలపై పూర్తి అవగాహన ఉన్న కాజల్.. ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ లను సెలక్టివ్ గా చూసుకుంది. అందుకే ఈ కొత్త సబ్జెక్ట్ కి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఓ సీనియర్ ప్రొడ్యూసర్ ఈ సినిమా తెరకెక్కించబోతున్నానరని సమాచారం.
కాజల్ బర్త్ డే రోజు అనౌన్స్ మెంట్..
సహజంగా హీరోల పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాలను అనౌన్స్ చేస్తుంటారు. ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి.. దీన్ని కాజల్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటిస్తారని అనుకుంటున్నారు. అన్నీ సజావుగా సాగితే.. జులై నుంచి ఈ కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.