వామ్మో వర్మో  ..... ఇదేమి సాంగ్ సామి .... ??

GVK Writings
సంచలన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏ సినిమా తీసినా అది ఒకింత సంచలనంగానే ఉంటుంది. కొన్నాళ్ల క్రితం వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు వంటి వివాదాస్పద చిత్రాలు తీసిన వర్మ, ఇటీవల ఏకంగా మియా మాల్కోవా తో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అనే న్యూడ్ ఫిలిం తో పాటు క్లైమాక్స్ అనే మరొక రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం తీసి అందరికీ షాక్ ఇచ్చారు.

అలానే గత ఏడాదిన్నర నుండి మనల్ని నానా ఇబ్బందులు పెడుతున్న కరోనా ని కూడా క్యాష్ చేసుకోదలచిన వర్మ, కరోనా వైరస్ పేరుతో ఒక మూవీ తీశారు. అయితే వర్మ ప్రత్యేకత ఏంటంటే తన సినిమాల జయాపజయాలతో తనకు సంబంధం లేదని, తన సినిమాలను నచ్చిన వారు చూడండి నచ్చని వారు చూడొద్దు అని చెప్తూ ఉంటారు. ఇక అసలు విషయం ఏమిటంటే తొలిసారిగా ఇద్దరు నటీమణులతో ప్రస్తుతం వర్మ తీస్తున్న సంచలన చిత్రం డేంజరస్. గతంలో తన సినిమాల్లో నటించిన అప్సరా రాణి, నైనా గంగూలీ లతో వర్మ ఈ మూవీలో తీస్తున్నారు.

ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఈ ఇద్దరు నటీమణులు లెస్బియన్స్ గా నటిస్తుండడం. తొలిసారిగా ఇండియన్ మూవీ స్క్రీన్ పై వస్తున్న ఈ సినిమా నుండి నేడు జబ్ సే అనే పల్లవితో సాగె వీడియో సాంగ్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విడుదల చేసిన వర్మ, ప్రపంచంలోని మొట్టమొదటి లెస్బియన్ డ్యూయెట్ సాంగ్ ఇది ఎంజాయ్ చేయండి అంటూ పోస్ట్ చేసారు. కాగా ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకుంటున్న ఈ సాంగ్ పై వామ్మో వర్మో ఇదేమి సాంగ్ సామి అంటూ నోరెళ్లబెడుతూ కామెంట్స్ చేస్తున్నారు పలువురు ఆడియన్స్. కాగా ఈ సినిమా త్వరలో విడుదల కానుంది ..... !!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: