పద్ధతి మార్చుకున్న జూనియర్ జోష్ లో కళ్యాణ్ రామ్ !

Seetha Sailaja

‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కోసం జూనియర్ సుమారు రెండున్నర సంవత్సరాలు మరే సినిమా చేయకుండా ఆ ప్రాజెక్ట్ గురించే అంకితం అయిపోయాడు. ఇప్పటికి కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ స్పష్టంగా ఏ తేదీన విడుదల అవుతుందో క్లారిటీ లేదు. దీనితో జూనియర్ ‘ఆర్ ఆర్ ఆర్’ తో సంబంధం లేకుండా తన సినిమాల వేగం పెంచాడు.


ఇప్పుడు ఆ వేగం జూనియర్ అన్న కళ్యాణ్ రామ్ కు అదృష్టంగా మారింది. ఇక రాబోతున్న రోజులలో జూనియర్ నటించే సినిమాలు అన్నింటిలోను కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామ్యం తీసుకోబోతోంది. ఇప్పటికే ప్రకటింప బడ్డ కొరటాల శివ జూనియర్ ల మూవీకి ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగ మారింది.


ఆతరువాత జూనియర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్న పాన్ ఇండియా మూవీకి కూడ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగ ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీలో కూడ కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ భాగస్వామిగ కొనసాగుతుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇక రానున్న కాలంలో ఎన్టీఆర్ నటించే అన్ని సినిమాలకు ఇదే విధానం కొనసాగే ఆస్కారం ఉందని లీకులు వస్తున్నాయి.


వాస్తవానికి ఈ ట్రెండ్ బాలీవుడ్ నుండి టాలీవుడ్ కు దిగుమతి అయింది. బాలీవుడ్ టాప్ హీరోలు అంతా తాము నటించే సినిమాలకు సంబంధించి ఒక స్థిర పారితోషికం తీసుకుంటూ తమ సొంత కుటుంబ సభ్యులను నిర్మాణ భాగస్వామిలుగా చేసి ఆ మూవీ లాభాలలో వాటాలు కూడ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి విధానాన్ని మహేష్ అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ లు అనుసరిస్తున్నారు. దీనితో జూనియర్ కూడ ఈ లేటెస్ట్ ట్రెండ్ వైపు దృష్టి పెట్టడంతో ఇప్పటివరకు హీరోగా సెటిల్ కాని కళ్యాణ్ రామ్ కు నిర్మాతగా దశ తిరిగినట్లే అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: