మహేష్ మ్యానియాకు సహకరిస్తున్న జూనియర్ ఫాన్స్ !

Seetha Sailaja
సోషల్ మీడియాలో మహేష్ బాబుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. వాస్తవానికి మహేష్ సోషల్ మీడియాలో సామాజిక రాజకీయ విషయాల పై స్పందించడు. కేవలం మహేష్ సాధారణ విషయాల పై మాత్రమే  స్పందిస్తూ ఉంటాడు. అయినా మహేష్ కు సోషల్ మీడియా ఫాలోయింగ్ రోజురోజుకి పెరిగి పోతూనే ఉంది.  


ప్రస్తుతం మహేష్  కు ఇతర హీరోల కంటే ట్విట్టర్ లో అత్యధిక ఫాలోయర్స్  ఉన్నారు. దీనితో టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సోషల్  మీడియాలో కూడ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం  మహేష్ బాబుకు ట్విట్టర్లో 11.4 మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. ఇది టాలీవుడ్ హీరోలకు సంబంధించి ట్విట్టర్ రికార్డు. ఇప్పుడు ఇదే మాధ్యమం పై మహేష్ మరో రికార్డు సాధించాడు. తన ట్వీట్లు 24 సార్లు 100 కే లైక్ లను సంపాధించడంతో మహేష్ అగ్రస్థానంలో ఉన్నాడు.  


ఇటీవల జరిగిన జూనియర్ పుట్టినరోజున తారక్ కు అభిననదనలు  తెలుపుతూ ఇటీవల  మహేష్ చేసిన ట్వీట్ కూడా 100 కె కి పైగా లైక్ లను పొందింది. మరోవైపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తన ట్విట్స్ కు సంబంధించి 100 కే లైక్ లను ఆరుసార్లు మాత్రమే పొంది మహేష్ తరువాత రెండవ స్థానంలో ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తరువాత  ఇలాంటి రికార్డు డు సార్లు సాధించిన సెలిబ్రిటీల లిస్ట్ లో రానా దగ్గుబాటి పవన్ కళ్యాణ్  నితిన్ అల్లు అర్జున్ రామ్ చరణ్ నానీ లు ఉన్నారు.


దీనితో మహేష్ సోషల్ మీడియా కింగ్ అంటూ అభిమానులు ప్రచారం మొదలు పెట్టారు. లేటెస్ట్ గా మహేష్ జూనియర్ ను విష్ చేస్తూ చేసిన ట్విట్ కు తారక్ అభిమానులు విపరీతంగాలైకులు కొట్టడంతో పరోక్షంగా మహేష్ సోషల్ మీడియా రికార్డులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడ బాగా సహకరిస్తు అతడిని ట్రెండింగ్ హీరోగా అభిమానులు మారుస్తున్నారు  అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: