ముత్యాల్లాంటి సినిమాలు చేసిన ముత్యాల సుబ్బయ్య..!!

P.Nishanth Kumar
నిన్నటి తరం దర్శకులలో ముత్యంలాంటి సినిమాలు చేసి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకున్న దర్శకులలో ఒకరు ముత్యాల సుబ్బయ్య.. మూడుముళ్ల బంధం అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు మామగారు, ఎర్రమందారం, పల్నాటి పౌరుషం, ఆడాళ్ళ మజాకా, పవిత్రబంధం, హిట్లర్, గోకులంలో సీత, పవిత్ర ప్రేమ, అన్నయ్య, దీవించండి వంటి ఎన్నో చిత్రాలు అందించిన ముత్యాల సుబ్బయ్య దర్శక విభాగానికి వన్నెతెచ్చిన దర్శకుడు అని చెప్పొచ్చు.. గోపీచంద్ ని హీరోగా టాలీవుడ్ కి పరిచయం చేసిన తొలి వలపు సినిమాని డైరెక్ట్ చేసిన దర్శకుడు ఈయనే కావడం విశేషం..
మన టాలీవుడ్ హీరోలు మెచ్చే అతి తక్కువ మంది దర్శకుల్లో ఆయన కూడా ఒకరు.. అప్పట్లో ప్రతి ఒక్క హీరో కూడా తనతో సినిమా చేయాలని ఆశపడే వారట ..  నెల్లూరు జిల్లా పారిపల్లి గ్రామంలో జన్మించి అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నారు..  కాగా ఆయనకు ఇద్దరు కుమారులు ఒక కూతురు సంతానంగా లభించారు.. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత చెన్నైకి సినిమా మీద ప్యాషన్తో వెళ్లి అక్కడ మనప్పురం అప్పారావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఆ తర్వాత మరికొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి , పి సి రెడ్డి గారికి కో-డైరెక్టర్ గా 10 సినిమాలు చేసి ఆ తర్వాత డైరెక్టర్ గా అవకాశం పొందారు..
అయితే తన కెరీర్ మొదలు పెట్టిన కొద్ది రోజుల్లోనే ఆయన మంచి దర్శకుడిగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.. తన కెరీర్లో ది బెస్ట్ సినిమా ఏది అంటే  ప్రతి ఒక్క అని చెబుతూ తన ఏ సినిమాని చిన్నచూపు చూడలేదని చాలా సందర్భాల్లో చెప్పారు.. తనకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అని అందుకే ఆయనతో అన్ని సినిమాలు సూపర్ హిట్ సినిమాలు చేశానని చెప్పారు.. అలాగే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, శ్రీకాంత్, వెంకటేశ్,  రాజశేఖర్ , రాజేంద్రప్రసాద్ అందరితో సినిమాలు చేయడం నా అదృష్టం అని ఆయన ఇటీవల ఈ సందర్భంగా వెల్లడించారు. నిన్నటితరం దర్శకులలో ఇంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ముత్యాల సుబ్బయ్య ఆఖరిగా 2008 సంవత్సరంలో ఆలయం అనే సినిమాతో తన కెరీర్ ని స్వస్తి పలికాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: