బామ్మ ఆటకు జెనీలియా భర్త ఫిదా..?

Suma Kallamadi
కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో ఉన్న గమ్మత్తైన విషయాలు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ప్ర‌తిభావంతులైన వ్యక్తుల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇదేకోవ‌లో తాజాగా ఒక వృద్ధురాలు ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. ఆమె ప్ర‌తిభ చూసిన‌వారంతా శ‌భాష్ అనకుండా ఉండ‌లేక‌పోతున్నారు. బాలీవుడ్ నటులు కూడా ఈ వృద్ధురాలికి అభిమానులుగా మారిపోయారు. చీర క‌ట్టుకుని, షూస్ ధ‌రించిన ఈ వృద్ధురాలు సూప‌ర్ బౌలింగ్ చేశారు. ఆటగాళ్లు సైతం ఆమె బౌలింగ్ చూసి వారేవా అంటున్నారు. బొమ్మ‌రిల్లు సినిమా హీరోయిన్ జెనీలియా భ‌ర్త‌, న‌టుడు రితేష్ దేశ్ ముఖ్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వృద్ధ మ‌హిళ‌కు సంబంధించిన వీడియో షేర్ చేశారు. చీర క‌ట్టుకుని బౌలింగ్ చేసిన ఈ బామ్మ‌గారిని పొగ‌డండి. ఆమె మాస్క్ కూడా వేసుకున్నారు. అంటూ కామెంట్ రాశారు.

ఈ వీడియోను చూసిన పలువురు బామ్మగారి ప్ర‌తిభ‌ను పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. గతంలో జెనీలియా తన భర్తకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. అప్పట్లో అది కూడా తెగ వైరల్ అయ్యింది.  తన భర్త తన కళ్ల ముందే మరో హీరోయిన్‌కు ముద్దు పెట్టాడని కొడుతూ ఓ వీడియో తీసింది. అది సరదా కోసం చేసినా కూడా ఈ వీడియో మాత్రం ఇప్పుడు సంచలనం రేపుతుంది. అందులో ఏముందంటే ఓ అవార్డు ఫంక్షన్‌లో నటి జెనీలియాతో పాటు ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ్ కూడా వచ్చారు. అక్కడ సీనియర్ హీరోయిన్ ప్రీతీ జింటా వాళ్లకు కలిసింది. దాంతో ప్రీతీ జింటా చేతులను పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు రితేష్. ఆ తర్వాత చాలా సేపు నవ్వుతూ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇదంతా పక్కనే ఉన్న జెనీలియా అసౌకర్యంగా చూస్తుంటుంది. వాళ్ల చనువు చూసి మొహంలో అప్పుడే ఎక్స్‌ప్రెషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. తన భర్త వేరే అమ్మాయితో క్లోజ్‌గా ఉండడాన్ని జెనీలియా తట్టుకోలేకపోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: