సన్నీ లియోన్ దేవత అంటూ ఫ్లెక్సీ... ఎక్కడ...?
ఎందుకంటే ఆమె కోసం ఒక ఫ్లెక్సీ వెలిసింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. సన్నీ అనగానే బూతు చిత్రాలు, ఒక సెక్సీ పాత్రలు చేసే నటిగానే ఎక్కువ మంది చూస్తారు. ఆమెలో మంచి మానవతావాది ఉంది. తాజాగా మండ్య జిల్లా కొమ్మర హళ్లి ఊరి వాళ్లకు ఆమెలోని మానవతావాది కనిపించింది. ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని ఆ ఊర్లో ఆమెకు ‘హ్యాపీ బర్త్డే సన్నీ లియోన్. అనాథ పిల్లలకు తల్లి, అభిమానులకు దేవత’ అని పెద్ద ఫ్లెక్సీ వేయించి, ఊరి మొదట్లో పెట్టారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఆ ఫోటోలు సన్నీ దాకా వెళ్లాయి.
దీంతో ఆమె షేర్ చేసింది. ఇక సన్నీలియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ ఇద్దరూ కలిసి ఒక అనాధ బాలికను దత్తత తీసుకున్నారు. ఆమెకు నిషా కౌర్ అనే పేరు పెట్టి ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. ఈ జంటకు సరోగాసి పద్ధతిలో పుట్టిన ఇద్దరు ట్విన్స్ ఉన్నప్పటికీ నిషా అంటే ప్రాణం. తమ జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసిన నిషా ఈ ప్రపంచంలోనే చిన్నారి దేవత అంటూ సన్నీ ఎప్పుడూ చెబుతూ ఉంటారు,