సరైనోడు, దువ్వాడ జగన్నాథం లాంటి సక్సెస్‌ల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం కోసం కథా, మాటల రచయిత వక్కంత వంశీ తొలిసారి దర్శకుడిగా మారారు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో స్టైలిష్ స్టార్‌ను యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా చూపించాడు వంశీ.సినిమా రిలీజ్‌కు ముందు రిలీజైన టీజర్లు, ట్రైలర్లకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డుస్థాయిలో జరిగింది. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి..కానీ ప్రేక్షకుల అంచనాలు తారుమారు చేస్తూ ప్లాప్ గా నిలిచింది ఈ సినిమా.అయితే సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం మాత్రం స్క్రీన్ ప్లే తో పాటూ సెకండాఫ్ అనే చెప్పాలి..సినిమాలో కోపం అనే ఒక పాయింట్ కొత్తగా ఉన్నా..
దాన్ని చాలా రొటీన్‌గా నడిపించడం, సాగదీయడం వలన మేకింగ్‌లో కొత్తదనం కనిపించలేదు.ఇక దర్శకుడు వక్కంతం వంశీ ఈ స్క్రిప్టు పై మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేది.ఎన్నో విజయవంతంమైన సినిమాలకు కథను అందించిన వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తాడు. ఓ రైటర్ డైరెక్టర్‌గా మారడంటే అందరి దృష్టి అతడి మీదే ఉంటుంది. అల్లు అర్జున్‌తో సినిమా అంటే అంచనాలు భారీగా పెరిగిపోతాయి. ఈ సినిమాకు సంబంధించిన వక్కంతం వంశీకి అదే సమస్యగా మారిందనిపిస్తుంది.
విభిన్నమైన పాయింట్‌తో అల్లు అర్జున్ను కొత్త కోణంలో చూపించడానికి చేసిన ప్రయత్నం బాగున్నా కానీ కథను ఒక ఫ్లోలో నడిపించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది.
కథ, కథనాలు, ఇతర క్యారెక్టర్లపై క్లారిటీ మరింత మెరుగ్గా ఇవ్వాల్సింది. కథలో ప్రేక్షకుడిని మెప్పించదగిన ఆ సోల్ ను దర్శకుడు మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది.ఇక సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే పరమ రొటీన్ గా సాగడం ఈ సినిమాకి మరో మైనస్ అని చెప్పొచ్చు.. ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన అను ఏమన్యుయల్ తో బన్నీ కి మధ్య కెమిస్ట్రీ కూడా అంతగా వర్కవుట్ కాలేదు..కానీ ఏమాటకి ఆమాట చెప్పుకోవాలి.. సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం అదిరిపోయాయనే చెప్పాలి..వ్వాటిల్లో బన్నీ ఆదరగొట్టేసాడు..సో అలా మొత్తానికి ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా చిత్రం చివరికి ఆడియన్స్ ని మెప్పించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి...!!