నేడు ధైర్యానికి మారుపేరైన పవన్ కళ్యాణ్.. నాటి తల్లిచాటు బిడ్డే?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలు తమ కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్నారు.  అయితే ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ ఒకప్పుడు అమ్మ చాటు బిడ్డలే అన్నది అక్షర సత్యం. ముఖ్యంగా కొంతమంది హీరోలు అయితే తల్లుల ప్రోత్సాహం లేనిదే ఈ స్థాయి వరకు ఎదిగే వారు కాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వారిలో ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిరంజీవి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణించారు.

 ఈ సమయంలో చిరంజీవి తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఎంతో భయపడిపోయారు. ఇక తన కుటుంబంలో ఎంతో సిగ్గు బిడియం తో అమ్మ చాటు బిడ్డగా పెరిగిన పవన్ కళ్యాణ్.. అందరితో చాలా తక్కువగా మాట్లాడేవారట. ఎప్పుడు అమ్మ తోనే మాట్లాడుతూ ఇక ఆమెతోనే కాలం గడుపుతూ ఉండేవాడట. ఒక్కసారిగా సినిమాలకు రావాలి అంటే ఎంతో భయపడిపోయారట పవన్ కళ్యాణ్. ఆ సమయంలో తన అన్నయ్య చిరంజీవి తో పాటు తన తల్లి అంజనాదేవి కూడా ఎంతో ధైర్యం చెప్పడంతో సినిమాల్లోకి రావడానికి ఒప్పుకున్నాడట.

 అయితే చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కి కాస్త ఆవేశం ఎక్కువగా ఉండడంతో ఇక తన తల్లి ఎప్పుడూ ఆవేశాన్ని తగ్గించుకోవాలని చెబుతూ మంచిచెడులను సూచిస్తూ ఉండేవారట. ఇక పవన్ కళ్యాణ్ యొక్క ఇష్టాలు అయిష్టాలు తెలుసుకునేవారట తల్లి అంజనాదేవి . అంతే కాకుండా ఇక మెగాస్టార్ తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎంతో ధైర్యం చెప్పి ప్రోత్సహించిందట తల్లి.  ఇలా తల్లి చాటు బిడ్డగా పెరిగి ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పవర్ స్టార్ గా మారిపోయాడు.  తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు సాధ్యం కాని రీతిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. చేసినవి తక్కువ సినిమాలే అయినా ఊహించని విధంగా క్రేజ్ సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: