అరుంధతి సినిమాలో చెప్పిన ఓ డైలాగ్ ఈ ఫోటో చుస్తే నిజమేనని అనిపిస్తుంది. కంటికి కనిపించేది నిజం కాదు అన్నట్టుగానే.. సినిమాలో చూపించే అన్ని సీన్స్ నిజం కాదని చెప్పకనే చెప్పారు. సినిమాలో అన్ని సన్నివేశాల్లో చాలా సహజంగా, అవలీలగా నటించేస్తారు. అయితే కొందరు హీరోహీరోయిన్లు మాత్రం లిప్ లాక్ సీన్లలో నటించబోం అని కండీషన్లు కూడా పెడతారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒకరు. తన 30 ఏళ్ల సినీ జీవితంలో ఒక్కసారి కూడా హీరోయిన్‌కు ముద్దు పెట్టుకోలేదు.
అయితే ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ ‘రాధే ’ సినిమా ట్రైలర్ చూసి, ఖాన్ భాయ్ అభిమానులు షాక్ అయ్యారు. హీరోయిన్ దిశా పటానీకి, హీరోకు మధ్య ముద్దు సీన్‌ను ట్రైలర్‌లో చూపించారు. ఇక సినిమాలో మాత్రం తన హద్దును తనే చెరిపేసుకున్నాడు సల్మాన్ ఖాన్. అయితే ఈ కండల వీరుడు తన పాలసీకి కట్టుబడి ఉన్నారని కొందరు అభిమానులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు.
ఇక రాధే ట్రైలర్‌లో చూపించిన ముద్దు సన్నివేశం ఫేక్ అని తేల్చారు. ఆ సీన్ ను స్క్రీన్‌సాట్ తీసి జూమ్ చేసి చూస్తూ హీరోయిన్ నోటికి ప్లాస్టర్ వేసి ఉన్నట్లు వాళ్ళు కనుగొన్నారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో తమ అభిమాన హీరో నో-కిస్సింగ్ పాలసీని ఇంకా అమలు చేస్తూనే ఉన్నాడని ఫ్యాన్స్ ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది వీటిపై మీమ్స్ రూపొందించి వైరల్ చేస్తున్నారు.
కాగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన యాక్షన్ సినిమా 'రాధే'లో జాకీ ష్రాఫ్, రణ్ దీప్ హుడా ముఖ్య పాత్రల్లో నటించారు. మే 13న ఈ చిత్రం ఓ వైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలో విడుదలవుతోంది. అయితే ఓటీటీలో పే పర్ వ్యూ విధానంలో అందుబాటులోకి రానుంది.ఇలా దేశంలో ఒకటికంటే ఎక్కువ ప్లాట్‌ఫాంలలో ఒకేసారి విడుదలైన సినిమాగా రాధే రికార్డు సాధించనుంది.