సప్తగిరి సహాయానికి షాక్ లో ఇండస్ట్రీ వర్గాలు !

Seetha Sailaja
కమెడియన్ గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఆతరువాత హీరోగా సెటిల్ అవ్వాలని కమెడియన్ సప్తగిరి చాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు అతడు చేసిన ప్రయత్నాలు ఏవీ సక్సస్ కాలేదు. అలాంటి పరిస్థితులలో ఉండి కూడ ప్రస్తుతం కరోనా తో పోరాటం చేస్తూ ఒక కార్పోరేట్ హాస్పటల్ లో వైద్యం చేయించుకుంటూ వైద్యానికి సంబంధించిన ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రముఖ రచయిత దర్శకుడు నంద్యాల రవికి సప్తగిరి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


ప్రస్తుతం నంద్యాల రవి కరోనా సోకడంతో చికిత్స తీసుకుంటున్న హాస్పటల్ బిల్ ఇప్పటివరకు 7 లక్షలు అయింది అని సమాచారం. ఇంకా ఎంత ఖర్చు పెరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో నంద్యాల రవికి చిరంజీవి ఆద్వర్యంలో నడపబడుతున్న కరోనా క్రైసెస్ సంస్థ నుండి 2 లక్షలు సహాయం ఇప్పటికే అందించినట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం నంద్యాల రవి ఆరోగ్య పరిస్థితి అతడితో పరిచయం ఉన్న చాలామంది టాప్ హీరోలకు మీడియం రేంజ్ హీరోలకు తెలిసినప్పటికీ వారు వ్యక్తిగతంగా ఈ దర్శకుడుకి సహాయం చేయకుండా మౌనంగా ఉంటున్నారు. కోట్ల రూపాయలలో పారితోషికం తీసుకునే మన టాప్ హీరోలు ఒకొక్క మనిషి 50 వేలు చొప్పున వేసుకున్నా నంద్యాల రవి హాస్పటల్ బిల్ వచ్చేస్తుంది కదా అంటూ ఇండస్ట్రీలోని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


ఒక్క నంద్యాల రవి మాత్రమే కాదు ఇండస్ట్రీకి సంబంధించిన ఎందరో కరోనా తో యుద్ధం చేస్తూ హాస్పటల్ బిల్లు కూడ కట్టుకోలేని పరిస్థితులలో ఉన్నారు. దీనితో ఇలాంటి వ్యక్తులను ఆదుకోవడానికి ఎదో ఒకటి మన టాప్ హీరోలు చేయకుండా మాస్క్ లు పెట్టుకోండి ప్లాస్మా దానం చేయండి అంటూ ప్రచారం చేయడం వల్ల ఇండస్ట్రీకి కలిగే ప్రయోజనం ఏమిటి అంటూ ఇండస్ట్రీలో కొందరి కామెంట్స్. కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లో చిరంజీవి చాల ఉత్సాహంగా ఇండస్ట్రీ పెద్దరికాన్ని తీసుకుని ఎంతోకొంత చేయడానికి ప్రయత్నాలు చేసాడు. అయితే ఈ సెకండ్ వేవ్ లో మాత్రం చిరంజీవి సేవా కార్యక్రమాలలో స్పీడ్ కనిపించడం లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: