ఎన్టీఆర్ ప్రణతిల వివాహ బంధానికి పదేళ్లు..
పెళ్లి రోజు ఇతర ముఖ్యమైన దినాలను కుటుంబం తోనే గడుపుతుంటారు . అంతే కాకుండా ఎన్టీఆర్ ఫ్యామిలీ పెద్దగా ఫోకస్ అవ్వడం ఇష్టపడరు . అందుకే పిల్లల ఫోటోలను కూడా సోషల్ మీడియాలో తక్కువగానే పోస్ట్ చేస్తుంటారు . ఇక ఈ ఏడాది మార్చ్ లో ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. నగరంలో ఓ కాస్ట్లీ ఫామ్ హౌస్ ను ఎన్టీఆర్ ప్రణతి పేరు మీద రాసిచ్చారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం జక్కన్న దర్శకత్వం లో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారు . ఇదిలా ఉండగానే ఎన్టీఆర్ తరవాత సినిమాను కొరటాల తో ఫిక్స్ చేసుకున్నారు. మరో వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నారు.