మహేష్ కంటే పెద్ద స్టార్ ఎవరంటే .... సంచలన కామెంట్స్ చేసిన వర్మ .... ??

GVK Writings
మహేష్ బాబు, ఈ పేరు చెపితే చాలు కోట్లాదిమంది ప్రేక్షకాభిమానులతో పాటు ఎందరో అమ్మాయిల హృదయాలు సైతం పులకరిస్తాయి. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా చిన్నతనం నుండి సినిమాలు చేస్తూ వస్తున్న మహేష్, రాజకుమారుడు మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అక్కడి నుండి ఎన్నో విజయాలు, బ్లాక్ బస్టర్ లు తన ఖాతాలో వేసుకుంటూ ఒక్కో సినిమాతో అమాంతం క్రేజ్, మార్కెట్, పాపులారిటీ, ఫ్యాన్స్ ని పెంచుకుంటూ కొనసాగుతున్న మహేష్, ప్రస్తుతం టాలీవుడ్ లోని నెంబర్ వన్ హీరో స్థానానికి దగ్గరగా ఉన్న నటుల్లో ఒకరని చెప్పకతప్పదు.

ఇక మహేష్ నుండి సినిమా వస్తుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో కూడా ఆయన ఫ్యాన్స్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. ఇక మహేష్ బాబుకి ఎందరో హీరోయిన్స్ తో పాటు పలు ఇతర భాషల నటుల్లో కూడా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా మహేష్ హ్యాండ్సమ్ నెస్ కి అలానే ఆయన యాక్టింగ్ కి ఫిదా అవ్వని వారు ఉండరు. ఇక మహేష్ తన ఫేవరెట్ యాక్టర్ అని, నాకు అమితాబ్ గారంటే ఎంతో ఇష్టం అయితే, ఆయన కంటే కూడా మహేష్ అంటే మరింత అభిమానం అని, అటువంటి గొప్ప నటుడు ఇండియాలో లేడు అంటూ పలు సందర్భాల్లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పడం జరిగింది.

అయితే లేటెస్ట్ గా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా వర్మ మాట్లాడుతూ, నేను మహేష్ బాబు మాత్రమే ఇండియాలో గొప్ప స్టార్ అనుకున్నాను, ఇటీవల అతడికి మించిన స్టార్ వచ్చేసింది అంటూ సంచలన కామెంట్స్ చేసారు. ప్రస్తుతం మన దేశాన్ని, ప్రజలను వణికిస్తున్న మహమ్మారి కరోనా మహేష్ కంటే పెద్ద స్టార్ అని, ఒకరకంగా అవి రజినీకాంత్, సల్మాన్ ఖాన్ కంటే కూడా పెద్దదని, దానిని తలుచుకోని వాడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు కదా, ఆ విధముగా అది మహేష్ కంటే కూడా పెద్ద సూపర్ స్టార్ అంటూ వర్మ సరదాగా మాట్లాడుతూ చెప్పారు. కాగా ప్రసతుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి......!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: